
Best Web Hosting Provider In India 2024

ఇంట్లో కొన్నిసార్లు కూరలు ఉండవు. కానీ ఆకలి గట్టిగా వేస్తుంది. పచ్చడి వేసుకుని తిని తిని బోర్ కొడుతుంది. అలాంటి సమయంలో ఇంట్లో ఉన్న వాటితోనే పచ్చి పులుసు చేసేయెుచ్చు. చేయడం కూడా చాలా ఈజీ. పది నిమిషాల్లో చేసేసి.. లాగించేయెుచ్చు. పచ్చి పులుసు చేసేందుకు పెద్దగా పదార్థాలు కూడా అవసరం లేదు. దీనిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చేస్తుంటారు.
ట్రెండింగ్ వార్తలు
పచ్చి పులుసు అనేది చింతపండు, బెల్లం, మసాలా దినుసుల మిశ్రమంతో తయారు చేస్తారు. అయితే కొందరు బెల్లం లేకుండా చేసేస్తారు. దాని టేస్ట్ కూడా బాగుంటుంది. దీనిని సాధారణంగా అన్నం లేదా ఇడ్లీతో సైడ్ డిష్‌గా వడ్డిస్తారు. పచ్చి పులుసు తయారు చేయడం సులభం. మంచి రుచితో ఉంటుంది. ఇప్పుడు పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
పచ్చి పులుసుకు కావాల్సిన పదార్థాలు
1 నిమ్మకాయ సైజు – చింతపండు
2 టేబుల్ స్పూన్లు – బెల్లం
1 టీస్పూన్ – ఆవ గింజలు
1 టీస్పూన్ – జీలకర్ర
2 టేబుల్ స్పూన్లు – నూనె
కొన్ని కరివేపాకు
2 – ఎండిన ఎర్ర మిరపకాయలు
1 – ఉల్లిపాయ, తరిగిన
1/2 టీస్పూన్- పసుపు పొడి
1/2 టీస్పూన్ – రెడ్ చిల్లీ పౌడర్
రుచికి ఉప్పు
గార్నిష్ కోసం కొత్తిమీర ఆకులు
పచ్చి పులుసు తయారీ విధానం
చింతపండును కాసేపు నీటిలో నానబెట్టాలి. తర్వాత దానిని పిండుకోవాలి. అందులో నుంచి చింతపండును తీసేయాలి. తర్వాత బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేయాలి. తర్వాత పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం, బెల్లం ఎర్ర కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5-7 నిమిషాలు మరిగించుకోవచ్చు. లేదంటే రెండు మూడు నిమిషాలకు కూడా గ్యాస్ మీద నుంచి దించుకోవచ్చు. తర్వాత కొత్తిమీర తరుగు వేయాలి. ఇక వేడివేడిగా అన్నం లేదా ఇడ్లీతో సర్వ్ చేయండి. బాగుంటుంది.
మీ రుచికి తగ్గట్టుగా బెల్లం, చింతపండు వేసుకోవాలి. కొందరు బెల్లం ఉపయోగించకుండా చేస్తారు. రుచిని మెరుగుపరచడానికి మీరు మునగకాయలు, వంకాయలు వంటి కూరగాయలను జోడించవచ్చు. అలా వేస్తే కాసేపు మరిగించాల్సి ఉంటుంది.