
Best Web Hosting Provider In India 2024

Megalopolis Movie: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది, రెండేళ్లు టైమ్ వెచ్చిస్తుంటారు. రాజమౌళి లాండి డైరెక్టర్లు అయితే నాలుగైదేళ్లు సినిమాల కోసం టైమ్ స్పెండ్ చేస్తుంటారు. కానీ హాలీవుడ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల మాత్రం తన మూవీ మెగలోపొలిస్ కోసం ఏకంగా నలభై ఏడేళ్లు టైమ్ కేటాయించారు.
వెయ్యి కోట్ల డబ్బు…
మెగాలోపొలిస్ మూవీ కి డైరెక్టర్‌గా, రైటర్ గానే కాకుండా ఓ ప్రొడ్యూసర్‌గా కూడా ఫ్రాన్సిఫ్ ఫోర్డ్ కొప్పోల వ్యవహరించాడు. ఈ మూవీ కోసం తన సొంత మనీ 120 మిలియన్ డాలర్లను వెచ్చించాడు. ఇండియన్ కరెన్సీలో వెయ్యి కోట్ల వరకు ఈ సినిమా కోసం డైరెక్టర్ ఖర్చుచేశాడు.ఫ్రాన్సిఫ్ ఫోర్డ్ కొప్పోల 47 ఏళ్ల పోరాటం తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
1977లోఅనౌన్స్…
మెగాలో పోలిస్ మూవీని 1977లో డైరెక్టర్ ఫ్రాన్సిప్ ఫోర్డ్ అనౌన్స్‌చేశాడు. 1983 వరకు దాదాపు ఆరేళ్ల పాటు కథను రాసుకున్నాడు. ఈ క థను తీసుకొని నికోలస్ కేజ్, రసెల్ క్రో, లియోనార్డ్ డికాప్రియో, రాబర్ట్ డీనిరో వంటి స్టార్ హీరోలను సంప్రదించాడు డైరెక్టర్.
కానీ సినిమా ఒకే అయినట్లేఅయి పలుమార్లు వాయిదాపడింది. ఆ తర్వాత సినిమాను నిర్మించడానికి ప్రొడ్యూసర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తనకున్న వైన్ బిజినెస్‌ను అమ్మేసి వెయ్యికోట్ల వరకు ఈ సినిమాపై పెట్టాడు ఫ్రాన్సిప్ ఫోర్డ్. స్టార్ హీరోలు తిరస్కరించిన ఈ సినిమాను చివరకు ఆడమ్ డ్రైవర్, ఎస్పోసిటో, అబ్రే ప్లాజాతో పాటు పలువురు హాలీవుడ్ నటులను తీసుకొని ఈ సినిమాను ఎన్నో కష్టాలు ఫ్రాన్సిస్ ఫోర్డ్ ఈ మూవీని పూర్తిచేశారు.
2022లో షూటింగ్ మొదలు…
2022లో షూటింగ్ మొదలుపెట్టి 2024లో పూర్తిచేశారు. కొవిడ్ కారణంగా ఈ సినిమాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైన ఫ్రాన్సిస్ మాత్రం పట్టువీడలేదు. షూటింగ్ పూర్తిచేయడమే కాకుండా రిలీజ్ వరకు తీసుకొచ్చారు. మెగాలోపొలిస్ మూవీ ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశాడు. అంతే కాకుండా ఈసినిమాను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ కూడా చేశాడు. ఈ స్క్రీనింగ్‌కు సూపర్ రెస్సాన్స్ వచ్చింది.
డిస్ట్రిబ్యూటర్ల తిరస్కరణ…
ఇంత చేసిన మెగాలోపొలిస్ మూవీని కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫ్రాన్సిస్ ఫోర్డ్‌కు ఎదురుదెబ్బగా మారింది. ఈ సినిమా పబ్లిసిటీ కోసం 600నుంచి ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ వెయ్యి కోట్లు దాటడం, ప్రమోషన్ కోసం ఆరు వందల కోట్లు వెచ్చించడం అంటే రిస్క్ అనే భావనలో ప్రొడ్యూసర్లు ఉన్నట్లు తెలిసింది. ఎలాగైనా ఈ ఏడాది మెగాలోపొలిస్ సినిమాను రిలీజ్ చేయాలని ఫ్రాన్సిస్ ఫోర్డ్ కంకణం కట్టుకున్నాడు.
గాడ్ ఫాదర్‌తో ఫేమస్…
ఓ అర్కిటెక్ట్‌కు, అవినీతి పరుడైన మేయర్‌కు మధ్య జరిగే కథతో మెగాలోపొలిస్ మూవీ తెరకెక్కింది. గాడ్ ఫాదర్, గాడ్ ఫాదర్ 2 మూవీలో హాలీవుడ్‌లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఫ్రాన్సిప్ ఫోర్డ్ కొప్పోల పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జాక్, ది రైన్ మేకర్, ది ఔట్ సైడర్స్‌తో పలు పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2011లో రిలీజైన ట్విక్సిట్ తర్వాత దాదాపు పదమూడేళ్ల పాటు పూర్తిగా మెగాలోపొలిస్ పైనే ఫోకస్ పెట్టాడు.
టాపిక్