Kalki 2898 AD Box Office: పడిపోయిన కల్కి 2898 ఏడీ కలెక్షన్స్.. 2 వారాల్లో వచ్చిన వసూళ్లు ఇవే!

Best Web Hosting Provider In India 2024

Kalki 2898 AD Box Office Collection: దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 3డీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైన రెండో బుధవారం బాక్సాఫీస్ వద్ద మరోసారి పతనమైంది. ఈ చిత్రం 14 వ రోజు భారతదేశంలో కేవలం రూ . 7.5 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో ఈ కల్కి సినిమా మొత్తం వసూళ్లు రూ. 536.75 కోట్లకు చేరాయి. 14వ రోజు ఈ సినిమా హిందీ వెర్షన్ రూ. 4.75 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.1.7 కోట్లతో రెండో స్థానంలో నిలిచాయి. తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు వరుసగా రూ.0.55 కోట్లు, రూ.0.1 కోట్లు, రూ.0.4 కోట్లు రాబట్టాయి.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల గురించి మాట్లాడితే.. సుమారు రూ. 456. 32 కోట్ల షేర్, రూ. 884 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. వీటిలో రూ. తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 167.07 కోట్ల షేర్, 259.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక కర్ణాటక నుంచి 14 రోజుల్లో రూ. 30.60 కోట్లు వచ్చాయి. అదేవిధంగా తమిళనాడు నుంచి రూ. 19.45 కోట్లు, కేరళ నుంచి రూ. 10.30 కోట్లు, హిందీతోపాటు రెస్టాఫ్ ఇండియా నుంచి రూ. 117.75 కోట్లు, ఓవర్సీస్‌ నుంచి రూ. 111.15 కోట్ల కలెక్ట్ అయ్యాయి.

ఇక కల్కి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 14వ ఒక్క రోజు కేవలం 97 లక్షలు మాత్రమే రావడం ఆశ్చకరంగా మారింది. గత రోజులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఇదిలా పక్కన పెడితే.. ఇప్పటికే లాభాలతో దూసుకుపోతున్న కల్కి సినిమాకు 14వ రోజు వచ్చిన కలెక్షన్స్‌తో చూస్తే మొత్తంగా రూ. 84.32 కోట్ల ప్రాఫిట్ వచ్చింది.

అయితే, రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా రూ. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేసి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, ప్రభాస్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం కలెక్షన్లతో పోటీలో ముందుంది. ఈ చిత్రంలో అమర యోధుడు అశ్వథ్థామ పాత్రను పోషించిన 81 ఏళ్ల అమితాబ్ బచ్చన్ తన వ్యక్తిగత బ్లాగ్ లో సుదీర్ఘ పోస్ట్ లో ఈ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు.

వీరితోపాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించారు. రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కల్కి చిత్రం ఇండియాలోనే అత్యంత ఖరీదైన మూవీగా రికార్డుకెక్కింది. అయితే, ‘బడే మియాన్ చోటే మియాన్’, ‘మైదాన్’, ‘యోధా’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వైఫల్యాలతో సతమతమవుతున్న హిందీ చిత్ర పరిశ్రమకు 2024లో ‘కల్కి 2898 ఏడీ’ హిందీ వెర్షన్ విజయం కాస్తా ఊరటనిచ్చింది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024