Best Web Hosting Provider In India 2024
MLA Danam Nagender Comments: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ రెండు రోజుల్లో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు. త్వరలోనే బీఆర్ఎల్పీ… కాంగ్రెస్ లో విలీనం అవుతుందని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలే మిగులుతారని దానం వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఉండే పరిస్థితి లేదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యేలకు కనీసం గౌరవం ఉండేది కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండేది కాదని చెప్పారు. కేవలం కేటీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్న నియోజకవర్గాలకు మాత్రమే నిధులు ఇచ్చుకున్నారని విమర్శించారు.ఆత్మగౌరవం ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా అక్కడ ఉండరని కామెంట్స్ చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఉంటుందని దానం చెప్పారు. ప్రజా సమస్యలను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చే నిధులు కూడా గత ప్రభుత్వంలో రాలేదని…. ప్రస్తుతం అలాంటి పెండింగ్ పనులన్నీ ఇప్పుడే జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
కేటీఆర్ పై దానం ఫైర్….
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. త్వరలోనే కేటీఆర్ అక్రమాలన్నీ బయటపెడుతానని హెచ్చరించారు. ఆయన స్నేహితులు కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఆ వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని దానం అన్నారు. త్వరలోనే బయటపెడుతానని ప్రకటించారు.
టాపిక్