2 crores gift: రెండు కోట్ల వాచీని బహుమతిగా ఇచ్చిన అనంత్ అంబానీ, ఎవరికిచ్చారంటే..

Best Web Hosting Provider In India 2024

అనంత్ అంబానీ విలువైన బహుమతులతో ముంచెత్తారు. ఒక్కొక్కరికి రూ .2 కోట్ల విలువైన చేతి గడియారం లభించింది. ఆశ్చర్యాలతో ముంచెత్తే అంబానీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పెళ్లి కొడుకు స్నేహితుల బృందానికి “ఆడెమర్స్ పిగ్వేట్” అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందిన ఖరీదైన వాచీని బహుమతిగా ఇచ్చారు. ఇవిప్పుడు ఆన్ లైన్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అతిథులు వాళ్లకిచ్చిన లగ్జరీ హ్యాంప్లర్ల వీడియోలను షేర్ చేశారు. వీటిలో ఈ అద్భుతమైన గడియారాలు ఉన్నాయి. అంబానీ పెళ్లంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఈ ఫొటోలు, వీడియోలు తెలియజేస్తున్నాయి. ఈ అద్భుతమైన బహుమతి అంబానీ వివాహం గొప్పతనాన్ని నొక్కిచెబుతుంది. వారి వేడుకలకు గుర్తుగా ఈ అసాధారణ బహుమతులు చిహ్నంగా ఉంటాయి.

 

అతిథులకు అనంత్ అంబానీ గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్:

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)

షారఖ్ ఖాన్, రణ్ వీర్ సింగ్ సహా తన వరుడి తరపు స్నేహితుల బృందానికి వీటిని బహుమతిగా ఇచ్చారు అనంత్ అంబానీ. ఈ వాచీ ధర అటూ ఇటూగా రెండు కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ వాచీలో 41 ఎంఎం 18 క్యారట్ల పింక్ గోల్డ్ కేస్, 9.5 ఎంఎం మందంతో ఉంది. సఫైర్ స్టోన్ క్రిస్టల్ బ్యాక్, స్క్రూ లాక్ క్రోన్ ఉన్నాయి. ఇందులో పింక్ గోల్డ్ టోన్డ్ డయల్, బ్లూ కౌంటర్లు, పింక్ గోల్డ్ తో పొదిగిన గంటలకు సంబంధించిన మార్కింగ్, ప్రకాశవంతమైన కోటింగ్‌తో రాయల్ ఓక్ ముళ్లు ఉన్నాయి.

ఈ గడియారంలో పింక్ గోల్డ్ టోన్డ్ ఉన్న ఇన్నర్ బెజెల్, మ్యానుఫ్యాక్చరింగ్ కాలిబర్ 5134 సెల్ఫ్-వైండింగ్ మూవ్మెంట్ ఈ వాచీకి ఉన్నాయి. అంటే పూర్తిగా ఆటోమెటెడ్ వాచీ అన్నమాట. ఇది వారం, రోజు, తేదీ, ఖగోళ చంద్రుడి వివరాలు, నెల, లీప్ సంవత్సరం, గంటలు, నిమిషాలను చూపించే శాశ్వత క్యాలెండర్ ను కలిగి ఉంటుంది. ఇది 40 గంటల బ్యాటరీ పవర్ రిజర్వ్ కలిగి ఉంది. 18 క్యారట్ల పింక్ గోల్డ్ బ్రాస్లెట్, ఎపి ఫోల్డింగ్ బకిల్, అదనంగా బ్లూ అలిగేటర్ స్ట్రాప్ కూడా ఈ వాచీకి వస్తుంది. 20 మీటర్ల వరకు నీటి నిరోధకత కూడా కలిగి ఉంటుంది.

 

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి గురించి

జూలై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు బ్రహ్మరథం పట్టారు. రణబీర్ కపూర్, అలియా భట్, కృతి సనన్, అనన్య పాండే, షనయా కపూర్, ఐశ్వర్యా రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య, వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్, రజనీకాంత్, అనిల్ కపూర్, ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ ఈ అతిథుల జాబితాలో ఉన్నారు. రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా తమ ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలతో మెరిశారు. ‘దిల్ ధడక్నే దో’ చిత్రంలోని ‘గల్లా గూడియన్’ పాటకు రణ్‌వీర్ తో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ డ్యాన్స్ ఫ్లోర్లో సందడి చేశారు.భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఉత్సాహభరితమైన డ్యాన్స్ మూవ్స్ చేస్తూ వేడుకలను ఆస్వాదించారు.

 
WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024