Best Web Hosting Provider In India 2024

Jana Senani Movie: తెలుగు మూవీ జనసేనాని థియేటర్, ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ అవుతోంది. జనసేనాని మూవీలో హరీష్ పేరడి, విను మోహన్ కీలక పాత్రల్లో నటించారు. తన్సీర్ ఎమ్ ఏ దర్శకత్వం వహించాడు.
భవానీ హెచ్‌డీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా జనసేనాని మూవీ త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.ఈ నెలలోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం. పొలిటిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందింది. కేరళకు సీఏం అయిన ఓ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ జీవితంలో ఎదురైన సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు.
జనధీపన్…
మలయాళం రిలీజైన జనధీపన్ అనువాదంగా జనసేనాని తెలుగులో రిలీజైంది. జనధీపన్ మలయాళంలో 2019లో రిలీజ్ కాగా…తెలుగు వెర్షన్ నేరుగా యూట్యూబ్‌లోకి వస్తోంది.
కేరళను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అధికారాన్ని చేపట్టిన ఓ సీఏం తన పదవిని నిలబెట్టుకోవడానికి ఏం చేయాల్సివచ్చింది? ప్రత్యర్థులు పన్నాగాల కారణంగా ఓ మర్డర్ కేసులో అనుమానితుడిగా అతడిపై ఆరోపణలు ఎలా వచ్చాయి? ఎర్రజెడ్డానే నమ్ముకున్న ఆ సీఏం జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ మూవీ కథ. సీఏం పాత్రను ట్రైలర్‌లో నెగెటివ్ షేడ్స్‌లో చూపించడంలో మలయాళంలో విమర్శలొచ్చాయి. దాంతో ఇది రియల్ లైఫ్ స్టోరీ కాదని, తాము ఫిక్షనల్‌గా రాసుకున్న కథ అంటూ మేకర్స్ ప్రకటించారు.
జెండా ఎత్తడం సులభమే…
జనసేనాని మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కమ్యూనిజానికి సంబంధించిన డైలాగ్స్ ఆసక్తిని పంచుతున్నాయి. ఇందులో హరీష్ పేరడి కన్నూర్ విశ్వంగా కనిపిస్తున్నారు. జెండాను ఎత్తడం సులభమే…కానీ ఆ జెండాను పాతడమే కష్టమైన పని అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. జనసేనాని మూవీకి మిజో జోసెఫ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. హరిప్రశాంత్, సునీల్ సుఖడ, కొట్టాయం ప్రదీప్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మహేష్‌బాబు స్పైడర్‌లో…
హరీష్ పేరడి మలయాళం, తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించాడు. తెలుగులో ధనుష్ సార్, మహేష్‌బాబు స్పైడర్‌తో పాటు మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు చేశాడు. తమిళ, మలయాళంలో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోన్నాడు.
ప్రస్తుతం టొవినో థామస్ ఏఆర్ఎమ్‌తో పాటు మలయాలంలో మరో మూడు సినిమాలు చేస్తోన్నాడు. తమిళంలో ఈ ఏడాది విశాల్ రత్నంతో పాటు మరికొన్ని సినిమాల్లో విలన్‌గా కనిపించాడు. వదంది వెబ్‌సిరీస్‌లో ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించాడు. సీరియల్ ఆర్టిస్ట్‌గా హరీష్ పేరడి నట ప్రయాణం మొదలైంది. బుల్లితెర డిఫరెంట్ రోల్స్ చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Best Web Hosting Provider In India 2024
Source / Credits