లోకేష్.. అదే మాట మిర్చి యార్డు ముందు చెప్పగలరా?’

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు ట్వీట్‌

తాడేపల్లి: చంద్రబాబు వల్లే క్వింటా మిర్చి మద్దతు ధర 11,781 రూపాయలు అన్న లోకేష్  అదే మాట గుంటూరు మిర్చి యార్డు ముందు చెప్పగలవా? అంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు స‌వాల్ చేశారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏసీ గదిల్లో కూర్చుని మిర్చి వ్యాపారులు, బ్రోకర్లతో మీటింగ్ పెడితే ఏం లాభం. మిర్చి యార్డ్కు వచ్చి మా పరిస్థితి చూసి మా బాధలు వింటే అర్ధమవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన రేటు వల్ల మిర్చి రైతు మరింత కష్టాల్లో పడతాడు. క్వింటా మిర్చి రూ.19,000 నుంచి రూ. 20,000తో ప్రభుత్వం కొనుగోలు చేయాలి’ అనేది మిర్చి రైతుల డిమాండ్.

మరి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..చంద్రబాబు వలనే మిర్చి మద్దతు ధర రూ.11,781 అంటూ రైతులపై ప్రేమను కురిపించే యత్నం చేశారు.  ఇదే ఎక్కువ అని, ఇంతకుమించి అనవసరం అన్న రీతిలో లోకేష్ ఏదో బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. 

Best Web Hosting Provider In India 2024