CM Revanth Delhi Tour : ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ భేటీ – కీలక అంశాలపై చర్చ..!

Best Web Hosting Provider In India 2024

CM Revanth Delhi Tour : ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌ భేటీ – కీలక అంశాలపై చర్చ..!

Maheshwaram Mahendra HT Telugu Feb 26, 2025 02:18 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 26, 2025 02:18 PM IST

ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. ఇందుకు కేంద్రం సాయాన్ని కోరారు. ఎస్ఎల్బీసీ ఘటన వివరాలను ప్రధాని మోదీకి వివరించారు.

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశం
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ సమావేశం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేంద్రం సాయాన్ని కోరారు. ఈ సందర్భంగా….  విభజన చట్టంలోని పెండింగ్‌ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ట్లు తెలిసింది. 

రాష్ట్రానికి అన్నివిధాలుగా చేయూత అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక SLBC టన్నెల్‌ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీతో చర్చించారు. ప్రమాదానికి గల కారణాలు, చేపట్టిన సహాయక చర్యలను వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డిజీపీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సుమారు గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో… రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై చర్చించారు. మూసీ నది సుందీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు పనులతో పాటు కేంద్ర నిధులపై చర్చిచినట్లు సమాచారం.

 

Whats_app_banner

టాపిక్

Cm Revanth ReddyNarendra ModiTelangana NewsTrending TelanganaDevotionalDevotional News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024