




Best Web Hosting Provider In India 2024

కలెక్షన్లలో అదరగొట్టిన కుబేర.. రూ.100కోట్ల మైల్‍స్టోన్ దాటిన ధనుష్, నాగార్జున సినిమా: వివరాలివే
కుబేర చిత్రం మంచి కలెక్షన్లను దక్కించుకుంటోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ టాక్‍తో కమర్షియల్‍గా సక్సెస్ సాధించింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లలో ఓ కీలకమైన మైల్‍స్టోన్ దాటేసింది.
తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన కుబేర చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. జూన్ 20న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్‌తో పాటు జోరుగా కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలో కుబేర చిత్రం ముఖ్యమైన మైల్‍స్టోన్ సాధించింది.
రూ.100కోట్ల క్లబ్‍లోకి..
కుబేర సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. ఐదు రోజుల్లోనే ఈ మైల్‍స్టోన్‍ను అధిగమించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూన్ 25) వెల్లడించింది. కుబేర వరల్డ్ వైడ్‍గా రూ.100కోట్ల గ్రాస్‍ను క్రాస్ చేసిందంటూ ఓ పోస్టర్ కూడా తీసుకొచ్చింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తొలిసారి రూ.100కోట్ల క్లబ్‍లోకి అడుగుపెట్టారు.
తెలుగులో జోరు.. తమిళంలో కాస్త డల్
కుబేర చిత్రం తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందింది. హిందీ, మలయాళం, కన్నడ భాషల డబ్బింగ్‍లోనూ విడుదలైంది. ఈ చిత్రానికి ఆరంభం నుంచి తెలుగులో మంచి కలెక్షన్లను దక్కుతున్నాయి. సూపర్ హిట్ దిశగా సాగుతోంది. అయితే, ధనుష్‍కు ఫుల్ క్రేజ్ ఉన్న తమిళనాడులో మాత్రం అనుకున్న రేంజ్‍లో పర్ఫార్మ్ చేయడం లేదు. తమిళంలో డల్‍గా వసూళ్లు ఉన్నాయి. తెలుగులోనే ఎక్కువ శాతం వసూళ్లు దక్కుతున్నాయి. మిగిలిన భాషల్లో మోస్తరుగా వస్తున్నాయి.
ప్రశంసల వర్షం
కుబేర చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. హృదయాలను తాకేలా ఈ మూవీని తెరకెక్కించిన దర్శకుడు శేఖర్ కమ్ములకు పొగడ్తలు దక్కుతున్నాయి. భారీ స్కామ్, ఓ బడా ధనవంతుడికి వ్యతిరేకంగా ఓ యాచకుడు పోరాడడం చుట్టూ ఇంట్రెస్టింగ్‍గా ఈ మూవీని ఆయన రూపొందించారు. థ్రిల్లర్ ఎలిమెంట్లతో పాటు సమాజంలోని పరిస్థితులను బలంగా చూపించారు.
ఈ చిత్రంలో ధనుష్ యాక్టింగ్ మరోసారి అదరగొట్టారు. యాచకుడి పాత్రలో జీవించేశారు. ఆయనకు మరో నేషనల్ అవార్డు వస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. కింగ్ నాగార్జున కూడా డిఫరెంట్ రోల్‍లో సూపర్ అనిపించారు. హీరోయిన్ రష్మిక మందన్నా కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలో మెప్పించారు. ఈ సినిమాలో జిమ్ సర్భ్ నెగెటివ్ రోల్ చేశారు.
కుబేర సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మరో హైలైట్‍గా నిలిచింది. ఈ మూవీని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‍పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, అజయ్ కైకాల నిర్మించారు.
సంబంధిత కథనం