ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు.. ఆరేడు సినిమాలను నిర్మిస్తున్నాను.. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు.. ఆరేడు సినిమాలను నిర్మిస్తున్నాను.. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

బిచ్చగాడు, బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ. హీరోగా, సంగీత దర్శకుడిగా విజయ్ ఆంటోనీ అందిస్తున్న సినిమా మార్గన్. జూన్ 26న నిర్వహించిన మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ ఈవెంట్‌లో విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు.. ఆరేడు సినిమాలను నిర్మిస్తున్నాను.. బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కామెంట్స్

సంగీత దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా ఎదిగాడు విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీ అందుకున్నాడు. అలాగే, బిచ్చగాడు 2 సినిమాతో కూడా బాగా అలరించాడు. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతూన్న విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్.

జూన్ 27న సురేష్ బాబుతో రిలీజ్

విజయ్ ఆంటోని నటించి నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మించారు. సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సమర్పించారు. మార్గన్ సినిమాను జూన్ 27న తెలుగు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్

ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ అయిన మార్గన్ టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా జూన్ 26న మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ అనే ఓ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నాడు.

మా మొదటి సక్సెస్ ఇదే

విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ .. “మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి చాలా ధన్యవాదాలు. ఆయన చాలా గొప్ప నిర్మాత. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాను. ఆయన మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా మొదటి సక్సెస్” అని అన్నాడు.

చాలా లేయర్లు ఉంటాయి

“లియో జాన్ పాల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు. ఇందులో చాలా లేయర్లు ఉంటాయి. నేను కంటెంట్ గురించి ఎక్కువ మాట్లాడితే కథ రివీల్ అవుద్ది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజింగ్‌గా ఉంటుంది” అని విజయ్ ఆంటోనీ తెలిపాడు.

తెలుగు, తమిళంలో

“నేను ఈ సినిమాకు సంగీతాన్ని అందించాను. భద్రకాళి, లాయర్ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాను. నేను ప్రస్తుతం ఆరేడు సినిమాల్ని నిర్మిస్తున్నాను. మా ‘మార్గన్’ ప్రస్తుతం తమిళ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాను” అని బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ చెప్పుకొచ్చాడు.

నటుడిగా పరిచయం చేస్తున్నా

“మా సిస్టర్ సన్ అజయ్ ధీషన్ బిచ్చగాడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అతడ్ని ఈ మార్గన్ చిత్రంతో నటుడిగా పరిచయం చేస్తున్నాను. భాష్యశ్రీ గారి పాటలు, మాటల వల్ల ఇది పూర్తి తెలుగు సినిమాగా అనిపిస్తోంది. బ్రిగిడ, దీప్శిఖ గొప్పగా నటించారు. జూన్ 27న రాబోతోన్న మా మార్గన్ సినిమాను అందరూ చూడండి” అని విజయ్ ఆంటోనీ కోరారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024