
Best Web Hosting Provider In India 2024

Bandla Ganesh Driver: చట్నీ విషయంలో తలెత్తిన గొడవ భార్య బలవన్మరణానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో జరిగింది. కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గోప తండాకు చెందిన రమణ, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ట్రెండింగ్ వార్తలు
సినీ నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్‌గా రమణ పనిచేస్తున్నాడు. చందన కూడా నగరంలోని ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్‌లోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు.
ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ విషయంలో రమణ భార్యతో గొడవ పడ్డాడు. సోమవారం ఉదయాన్నే అతడు విధులకు వెళ్లిర తర్వాత భార్య చందన పలుమార్లు వీడియోకాల్స్ చేసింది. అతడు స్పందించక పోవడంతో ఫోన్ చేసి కావాలనే తనతో గొడవ పడుతున్నావంటూ గట్టిగా కేకలు వేసింది. తాను చనిపోతానని చెప్పి ఫోన్ పెట్టేసింది.
భార్య తీరుపై అనుమానం వచ్చిన రమణ ఇంటి యజమానికి ఫోన్ చేసి త్వరగా తన ఇంటికి వెళ్లాలని కోరాడు. దీంతో ఓనర్ ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా అప్పటికే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చందన కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో కేసేునమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిందా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు.