మేనిఫెస్టో అమలుపై చర్చించే దమ్ముందా బాబూ..?

Best Web Hosting Provider In India 2024

మా సభల్లో మా మేనిఫెస్టో గురించి చెబుతాం..నీ సభల్లో మీ మేనిఫెస్టో గురించి చెప్పే ధైర్యముందా?

రాయచోటి ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

క్రెడిబిలిటీ లేని నాయకుడు చంద్రబాబు. 

బాబుకున్న క్రెడిబిలిటీ నయవంచన,మోసం,ద్రోహం 

మేం 175 సీట్లలో ధైర్యంగా పోటీ చేస్తున్నాం..నీకు ఆ ధైర్యం ఉందా? 

ఓ పక్క బీజేపీ కావాలంటావ్‌..కుదిరితే కాంగ్రెస్‌ అంటావ్‌..

జనసేనే బతుకుదెరువు నువ్వంటావ్ ..నావల్లే టీడీపీ బతుకుతుందని పవన్ అంటాడు.  

ఇంతకీ ఎవరి వల్ల ఎవరు బతుకుతున్నారు..?: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు నీలా మానిప్యులేటెడ్‌ రాజకీయాలు చేయడు బాబూ..!

కులాలు, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి బాబు దిగజారాడు

నీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు సంగతేంటి బాబూ..?

జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది నువ్వు కాదా? 

ఆయన అభిమానులు బయటకు వస్తే కర్రలతో దాడి చేసి కొట్టిన చరిత్ర నీది.

తమ్ముళ్లూ…చౌకగా మద్యం అందిస్తానని ఓట్లడగడానికి సిగ్గు లేదా బాబూ..?

ఎన్నికల్లో వచ్చిన తీర్పే మరో సారి రిపీట్‌ కాబోతుంది.: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి. 

అన్న‌మ‌య్య జిల్లా:  మేనిఫెస్టో అమలుపై చర్చించే దమ్ముందా అంటూ ఎమ్మెల్యే గ‌డికోడ శ్రీ‌కాంత్‌రెడ్డి చంద్ర‌బాబును స‌వాల్ చేశారు. మా సభల్లో మా మేనిఫెస్టో గురించి చెబుతాం..నీ సభల్లో మీ మేనిఫెస్టో గురించి చెప్పే ధైర్యముందా? అని ప్ర‌శ్నించారు. 

వైయ‌స్ఆర్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

చంద్రబాబంత మానిప్యులేటెడ్‌ నాయకుడు దేశంలోనే లేడు:
–మానిప్యులేటెడ్‌ రాజకీయాల్లో తనకు ఎవరూ సాటి రారు అని చంద్రబాబు ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉంటాడు. 
– ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలా మానిప్యులేటెడ్‌ రాజకీయాలు చేయడు..చేయలేడు. 
– ప్రజలకు చేసిన మేలు చెప్పి..దాన్ని చూసి నన్ను ఆదరించండి అని ఏ రోజూ చంద్రబాబు మాట్లాడడు. 
– తాను ముఖ్యమంత్రిగా చేయలేదన్నట్లు, ప్రజలు అన్నీ మర్చిపోయినట్లు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. 
– మార్పులు తెస్తాను..ఆవకాశాలు ఇవ్వండి అనే ఈ వ్యక్తి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను అన్నది మర్చిపోయాడు. 
– ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి..చంపేసి పదవి లాక్కున్నాడు. మరో సారి కార్గిల్‌ యుద్ధం సమయంలో వాజ్‌పేయ్‌ గారితో పొత్తుతో గద్దెనెక్కాడు. 
– ఇంకోసారి రాష్ట్రాన్ని విడగొట్టి..మోడీ కాళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. 
– మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన పేరు చెప్పుకుంటే ఏ ఒక్కటీ గుర్తుకు రాదు. 
– రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో ప్రజలకు ధైర్యం వచ్చింది..సామాన్యుడు తలెత్తుకుని జీవించే పరిస్థితి వచ్చింది. 
– 2019 తర్వాత చంద్రబాబు కొత్త నాటకాలు ప్రారంభించాడు..ఎవరూ అనని మాటలు అన్నట్లు కన్నీరు కారుస్తున్నాడు.
– దొంగపనులు చేసి అడ్డంగా దొరికి అరెస్టయి..అన్యాయంగా అరెస్టు చేశారంటూ మాట్లాడుతున్నారు. 

జనాలు లేని కాళీ కుర్చీల సునామీ అది:
– ఇప్పుడు పార్లమెంటుకో సభ అంటూ బయలు దేరాడు. జనాలు లేకపోయినా జనసునామీ అంటాడు. 
– తాను రాయలసీమకు మంచి చేసిన వ్యక్తిగా తనకు తాను డప్పు కొట్టుకుంటున్నాడు. అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడు. 
– 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనీవా, గాలేరునగరి పథకాలను సామర్ధ్యం తగ్గించి తాగునీటి ప్రాజెక్టులుగా చేసిన ఘనుడు చంద్రబాబే.
– ఈ రోజు రాయలసీమ వాసులు తలెత్తుకుని తిరుగుతున్నారంటే అది రాజశేఖరరెడ్డి  వల్లే.
– అనంతపురంలో నేడు రెండు పంటలు పండుతున్నాయంటే పోతిరెడ్డిపాడు విస్తరణే కారణం అన్నది మర్చిపోయాడు. 
– ఆనాడు పోతిరెడ్డిపాడు విస్తరణను అడ్డుకున్న ఇదే చంద్రబాబు నేడు సీమలో సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. 

కులాల పేరుతో రాజకీయాలు చేసే నీచానికి దిగజారడం ఎందుకు చంద్రబాబూ..?:
– కులాల పేరెత్తి మాట్లాడుతున్నాడు. రెడ్లు..మీకేం చేశారు అని మాట్లాడుతున్నాడు. 
– అంత సీనియారిటీ ఉన్న నువ్వు ఇంత నీచానికి దిగజారడం అవసరమా? 
– నువ్వు నిరుత్సాహంతో ఒక కొడుకు వయసున్న జగన్‌ గారిని ఎదుర్కోలేక నీచంగా దిగజారాల్సిన అవసరం ఏమొచ్చింది? 
– నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు జడ్జీలుగా ఉండటానికి అర్హతలేదన్నది మర్చిపోయావా? 
– ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారన్నది మర్చిపోయావా? 
– ఈరోజు వారిపై ప్రేమ కురిపిస్తూ మాట్లాడటానికి నీకు సిగ్గు లేదా? 
– షర్మిల గారు ఆ రోజే చెప్పారు. చిన్న చిన్న సమస్యలు..ఏ ఇంట్లో ఉండవన్నా అని అన్నారు. 
– చిన్న చిన్న సమస్యలను వ్యక్తిగతంగా చూపడం నీకు ఎంత వరకూ సమంజసం. 
– నీ కుటుంబంలో నీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నారు అని అడిగితే సమాధానం ఏంటి? 
– ఆయన్ను అన్యాయంగా బలిచేశావని అందరూ మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మాట్లాడితే తల ఎక్కడపెట్టుకుంటావు..? 
– ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆ కుటుంబంలో ఏ ఒక్కరినీ పైకి రానివ్వలేదు. 
– జూనియర్‌ ఎన్టీఆర్‌ పైకి వస్తున్నాడని తెలిసి అతని సినిమాలు నిలిపివేయాలని ఆదేశాలిచ్చి కుట్రలు చేసింది నువ్వు కాదా? 
– అదే జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు బయటకు వస్తే కర్రలతో దాడి చేసిన కొట్టిన చరిత్ర నీది.
– నీ కుటుంబంలో జరిగే వాటి గురించి నువ్వేం చెప్తావ్‌ బాబు..? 
– ధైర్యముంటే నువ్వేం చేశావో చెప్పు…రాజకీయంగా ఎదుర్కో…
– అంతేకానీ దిగజారి మాట్లాడటం ఎంత వరకూ సమంజసం? 

మద్యం అందిస్తా…నాకు ఓటేయండి అనే నీచస్థాయికి దిగజారిన చంద్రబాబు:
– ఈ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు ఇంగ్లీషు మీడియం నుంచి సచివాలయాలు, ఆస్పత్రుల వంటి అనేక గొప్ప కార్యక్రమాలు చేపట్టాం. 
– రూ. 2.5 లక్షల కోట్ల డీబీటీ గురించి నువ్వెందుకు మాట్లాడలేకపోతున్నావు..? 
– ఇంతే బడ్జెట్‌ ఉండే నీ పరిపాలనలో ఆ డబ్బు అంతా ఏం చేశావ్‌ అని అడిగితే ఎదురుదాడి చేస్తావు. 
– తమ్ముళ్లూ మీకు మద్యం ఇస్తామని చెప్పడానికి సిగ్గు లేదా? 
– మద్యం వల్ల కుటుంబాలు చిద్రమవుతున్నాయి..అందుకే ధరలు పెంచి సామాన్యుడికి షాక్‌ కొట్టేలా చర్యలు తీసుకున్నాం. 
– ఇది సామాన్యుడిని దెబ్బకొట్టడానికి కాదు..తాగుడు మాన్పించే ప్రయత్నం. వాళ్లు బానిసలైతే కుటుంబాలు రోడ్డున పడతాయి అనే బాధతో ఆ నిర్ణయం. 
– పేద కుటుంబాలకు తాగుడును దూరం చేసి అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలని జగన్‌గారు ప్రయత్నం చేస్తున్నారు. 
– నువ్వేమో మందుబాబులు మీరు నాకు ఓటేయండి..ధరలు తగ్గిస్తా అంటున్నావంటే ఎంత నీచ సంస్కృతికి దిగజారావో నువ్వే ఆలోచన చేసుకో.
– ఎన్టీఆర్‌ మద్యనిషేదం అని అధికారంలోకి వస్తే…దాన్ని ఎత్తేసిన చరిత్ర నీది చంద్రబాబూ. 
– నేను ఒక గొప్ప విజనరీ అని చెప్పుకునే నువ్వు..నీ వల్లే రాష్ట్రం విడిపోయిందని చెప్పవు. 
– నీ సంతకం వల్లే రాష్ట్రం విడిపోయింది. నీ నీచరాజకీయ వ్యబిచారంతో రాష్ట్రాన్ని విడగొట్టావు. 
– నువ్వేదో విజినరీవి అని అధికారం ఇస్తే ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని ఏం చేశావో అందరికీ తెలుసు. 
– వైజాగ్‌ను మేం అభివృద్ధి చేస్తుంటే కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొస్తావు..
– అక్కడ నీ సొంత మనుషులకు ముందే భూములు కట్టబెట్టి ఒక వర్గం వారినే కోటీశ్వరులను చేయాలని ప్రయత్నం చేశావు. 
– ఇవన్నీ వాస్తవాలను ప్రజలు తెలుసుకున్నారని తెలిసి ఎదరుదాడి చేస్తున్నావు. 
– నువ్వు ఎంత గట్టిగా అరిస్తే ప్రజలు అంతగా నమ్ముతారు అనుకుంటున్నావేమో..నీ చరిత్ర అంతా ప్రజలకు తెలుసు. 

నీ 2014 మేనిఫెస్టో తీసుకుని రాగలవా..ఇది నా ఓపెన్‌ చాలెంజ్‌:
– గుండె మీద చేయి వేసుకుని ఈ ప్రభుత్వం ద్వారా మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి అనే చెప్పుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశావా? 
– నీకు ధైర్యం ఉంటే..చిత్తుశుద్ధి ఉంటే వచ్చే మీటింగుకు నీ 2014 మేనిఫెస్టో తీసుకుని రా. ఇది నా ఓపెన్‌ చాలెంజ్‌. 
– మేం 2019లో మా మేనిఫెస్టో తీసుకుని మేం వస్తాం. 
– రాజకీయాల్లో మేం దిగజారి మాట్లాడం. సంస్కారంతో చాలెంజ్‌ చేస్తున్నాం. 
– ఈ ఒక్క చాలెంజ్‌ స్వీకరించు..దమ్ముంటే దీన్ని స్వీకరించు..వేరేది ఏమీ అవసరం లేదు. 
– ఇదే ఎజెండా..రాజకీయ పార్టీలకు మేనిఫెస్టోనే ఎజెండా. 
– ఓపెన్‌ చాలెంజ్‌..మా సభల్లో మా మేనిఫెస్టో గురించి మాట్లాడతాం..నీ సభలో నువ్వు 2014 మేనిఫెస్టో గురించి మాట్లాడు. 
– ఏది వాస్తవమో ప్రజలు చూస్తారు. నీలా సంస్కారం మరచి మేం మాట్లాడలేం. ఈ సంస్కారవంతమైన చాలెంజ్‌కి రా. 
– ఒక నాయకుడికి క్రెడిబిలిటీ ఉండాలి..నిజాయితీ ఉండాలి. మంచి ఆలోచన ఉండాలి. 
– ఇతనికి ఉండేది కేవలం నయవంచన..మోసం..ద్రోహం..సత్యదూరమైన మాటలు మాట్లాడటం..ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఎంతకైనా దిగజారడం. 
– మేం 175 సీట్లలో ధైర్యంగా పోటీ చేస్తున్నాం..నీకు ఆ ధైర్యం ఉందా? 
– మీకు నిజంగా ప్రజాబలం ఉంటే ఎందుకు మీరు ఒంటరిగా ధైర్యంగా రాలేకపోతున్నారు..? 
– ఓ పక్క బీజేపీ కావాలంటావ్‌..మరో పక్క కుదిరితే కాంగ్రెస్‌ కావాలంటావ్‌.
– జనసేనే నా బతుకుతెరువు అంటావు..ఆ జనసేన ఆయన నావల్లే టీడీపీ బతుకుతుంది అంటాడు. 
– ఎందుకు మీరు ధైర్యంగా ఒంటరిగా రాలేకపోతున్నారో ప్రజలందరికీ తెలుసు. 
– ఒంటరిగా మేం ఏం చేశామో చెప్పి ప్రజల్ని ఓట్లడిగే ధైర్యం మా నాయకుడు జగన్మోహన్‌రెడ్డి గారికి ఉంది. 
– కుటుంబాల గురించి మాట్లాడే నీచసంస్కృతి ఉన్న నిన్ను ప్రజలు క్షమించరు. 
– రాయలసీమకు నువ్వు ఎంత ద్రోహం చేశావో ప్రతి ఒక్కరికీ తెలుసు. 
– గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు మరో సారి రిపీట్‌ కాబోతుంది. 

వైనాట్‌ 175 అనేదే మా టార్గెట్‌:
– వైనాట్‌ 175 అనేదే మా టార్గెట్‌. మా నాయకుడి ధైర్యమే మా ధైర్యం. 
– ప్రజలకు మంచి చేశామనే ధైర్యంతో మేం ముందుకు వెళ్తున్నాం. 
– షర్మిల గారే కాదు..ఎవరికైనా వ్యక్తిగత ఆలోచన విధానాలు వారికి ఉంటాయి. 
– దాని గురించి మాట్లాడటం సమంజసం కాదు. 
– గతంలో కాంగ్రెస్‌ పార్టీ ద్రోహం చేసిందని మాట్లాడారు..మళ్లీ ఏ ఆలోచనతో దగ్గరయ్యారో మనకు తెలియని అంశం. 
– ఎమ్మెల్యేల విషయంలో ప్రాంతాల పరిస్థితులను బట్టి ప్రజలకు దగ్గరగా ఉండేవారికే మా నాయకుడు టిక్కెట్‌ ఇస్తున్నారు. 
– ఆ విషయం అనేక సార్లు మా నాయకుడు స్పష్టం చేస్తూనే ఉన్నారు. 
– ఎమ్మెల్సీ రామచంద్రయ్య పార్టీకి వచ్చిన వెంటనే పార్టీ గౌరవించి సముచిత స్థానం కల్పించింది. 
– పార్టీ మారి వచ్చినా ఆయనకు అంత గౌరవం ఇచ్చాం. ఏ కారణంతో ఆయన పార్టీ మారారో తెలియదు. 
– మా రాజశేఖరరెడ్డి గారి బిడ్డ..బయటకు పోకూడదనే కోరుకుంటాం. 
– తన ఆలోచనలు ఎందుకో పక్కకు వెళ్లాయి. జగన్‌ గారు రాజశేఖరరెడ్డి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 
– రాజశేఖరరెడ్డి గారి వారసుడిగా ప్రజలు జగన్‌ గారిని గుర్తించారు.  

Best Web Hosting Provider In India 2024