Pawan Kalyan OG: ఓజీ మూవీలో పాట పాడనున్న పవన్ కల్యాణ్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన తమన్

Best Web Hosting Provider In India 2024

Pawan Kalyan Sing A Song In OG: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతో కూడా అలరించేందుకు రెడీ అవుతోన్నారు. ఇటీవలే బ్రో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ టైటిల్‌తో వస్తున్న ఓజీకి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు

ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ హీరోగా చేయడమే కాకుండా సింగర్‌గా కూడా నిరూపించుకున్నాడు. ఇదివరకు అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడా అనే పాట పాడి తన గాత్రం వినిపించారు. ఆ సినిమాలో ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సినిమాకు మెయిన్ హైలెట్స్‌లో పవన్ పాడిన ఆ పాట ఒకటిగా మారింది. ఇదే కాకుండా అత్తారింటికి దారేది కంటే ముందు తమ్ముడు సినిమాలో ఏం పిల్ల మాటడావా అని పాటతో మొదలు పెట్టిన పవన్ చాలా సినిమాల్లో గాత్రం వినిపించాడు.

తమ్ముడు సినిమాలో ఏం పిల్ల మాటాడవా పాటతోపాటు తాటి చెట్టు ఎక్కలేవు, ఖుషి సినిమాలో బై బయ్యే బంగారు రవణమ్మ.. జానీ మూవీలో నువ్వు సారా తాగకు, రావోయి మా ఇంటికి, పంజా సినిమాలో పాపారాయుడు, అత్తారింటికి దారేది మూవీలో కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలో కొడకా కోటేశ్వర్ రావు వంటి పాటలతో సింగర్‌గా పవన్ కల్యాణ్ అలరించాడు. ఇప్పుడు మరోసారి తన పాటతో ఫ్యాన్స్‌, తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నాడట పవన్ కల్యాణ్.

ఓజీ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. “ఓజీ స్క్రిప్ట్‌లో పవన్ గారి చేత పాట పాడించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మేం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నాం” అని తాజాగా సూపర్ సింగర్ సీజన్ 2కి గెస్టుగా వెళ్లిన తమన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకుంటే ఓజీలో పవర్ స్టార్ పాట పాడటం మనం వినొచ్చని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తమన్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ఇచ్చాడు. వాటిలో ఓ పాటను పుణెలో షూటింగ్ కూడా చేశారు.

 

ఓజీలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నటిస్తోన్న మలయాళ క్యూట్ భామ ప్రియాంక అరుల్ మోహన్ ఇద్దరిపై ఆ పాట తెరకెక్కించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రీమతి పార్వతి సమర్పిస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్, ప్రియాంకతోపాటు బాలీవుడ్ పాపులర్ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఓజీలో సీరియల్ కిస్సర్‌గా పేరొందిన ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నాడు.

ఓజీ సినిమాతోనే ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే, మంచి లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలతో హీరోగా పాపులర్ అయిన ఇమ్రాన్ హష్మీ ఇటీవల సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీలో విలన్‌గా చేశాడు. ఇప్పుడు తెలుగులోకి ఓజీ ద్వారా విలన్‌గా పరిచయం కానున్నాడు. అంతేకాకుండా, ఓజీ సినిమాలో వీళ్లతోపాటు ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, వెంకట్ తదితరులు నటిస్తున్నారు.

WhatsApp channel
 

టాపిక్

 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024