Best Web Hosting Provider In India 2024
Akhil in Salaar Sequel: ప్రభాస్ సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మూవీ టీమ్ నిర్వహించిన సలార్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ లో అఖిల్ అక్కినేని కనిపించడం కొత్త పుకార్లకు తావిచ్చింది. సలార్ సీక్వెల్ సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం మూవీలో అఖిల్ నటించబోతున్నాడని, అందుకే మూవీ టీమ్ తో ఫస్ట్ పార్ట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
సలార్ గతేడాది డిసెంబర్ 22న రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసినట్లు మూవీ టీమ్ చెబుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 16) సలార్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి మూవీలో నటించిన ప్రభాస్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావుతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రొడ్యూసర్స్ అందరూ హాజరయ్యారు.
అఖిల్ ఏం చేస్తున్నాడు?
సలార్ మూవీ టీమ్‌తోపాటు చేతికి కట్టు కట్టుకున్న అఖిల్ అక్కినేని ఆ సెలబ్రేషన్స్ లో కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అఖిల్ కు ఈ సెలబ్రేషన్స్ తో సంబంధం ఏంటన్న సందేహం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచే సలార్ సీక్వెల్లో అఖిల్ నటించబోతున్నాడన్న వార్తలు మొదలయ్యాయి. అంతేకాదు కొందరైతే మరో అడుగు ముందుకేసి దేవా తమ్ముడి పాత్ర అతడిదే అని కూడా తేల్చేస్తున్నారు.
గతేడాది ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత అఖిల్ మరో సినిమా చేయలేదు. తన తర్వాతి సినిమా షూటింగ్ లో భాగంగా సెట్స్ లో అఖిల్ తన చేతికి గాయం చేసుకున్నట్లు తెలిసింది. ఆ కట్టుతోనే అతడు ఈ సెలబ్రేషన్స్ కు వచ్చాడు. అఖిల్ తో నీల్ మామ ఏదో ప్లాన్ చేస్తున్నట్లే ఉన్నాడని ఫ్యాన్స్ ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.
సలార్ సీక్వెల్లో అఖిల్.. నిజమెంత?
సలార్ సీక్వెల్లో అఖిల్ నటించబోతున్నాడన్న వార్తల్లో నిజమెంత అన్నది తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి అదంతా ఉత్త పుకార్లే అని తేలింది. ఈ సలార్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న ఓ వ్యక్తి హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడారు. సలార్ సెలబ్రేషన్స్ కు ఇతర కొంతమంది గెస్టులను పిలిచినట్లే అఖిల్ ను కూడా పిలిచారని, అంతే తప్ప సీక్వెల్లో అతడు నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.
మరోవైపు సలార్ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలో రిలీజై 26 రోజులైంది. ఇప్పటికే చాలా కొత్త సినిమాలు రావడంతో సలార్ కలెక్షన్లు తగ్గిపోయాయి. దీంతో త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా రానుంది. రిపబ్లిక్ డే లేదంటే ఫిబ్రవరి 4న రావడం ఖాయంగా కనిపిస్తోంది.
హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత సలార్ రూపంలో ప్రభాస్ కు మంచి హిట్ దక్కింది. ఈ మూవీ తర్వాత ఈ ఏడాది కల్కి 2898 ఏడీ, ది రాజాసాబ్ మూవీలతో ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ రానున్నాడు. మే 9న కల్కి రిలీజ్ కానుండగా.. రాజాసాబ్ డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.