Best Web Hosting Provider In India 2024
Operation Valentine First Single: వరుణ్ తేజ్, మానుషి చిల్లార్ నటిస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్ నుంచి వందేమాతరం అనే ఫస్ట్ సింగిల్ రిలీజైంది. రిపబ్లిక్ డే రానున్న తరుణంలో ఈ మూవీ నుంచి దేశభక్తిని చాటే ఈ సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీలో లీడ్ రోల్స్ ఇద్దరూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులుగా కనిపించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
వరుణ్ తేజ్‌తోపాటు మానుషి చిల్లార్, డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఈ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. వందేమాతరం అంటూ సాగిపోయిన ఈ పాటకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించగా.. రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ రాశాడు. యుద్ధానికి బయలుదేరుతున్న వరుణ్ తేజ్ ను ఈ పాటలో చూడొచ్చు. పాట లిరిక్స్ మొత్తం దేశభక్తిని చాటేలా ఉన్నాయి.
వాఘా సరిహద్దులో సాంగ్ లాంచ్
ఈ ఫస్ట్ సింగిల్ ను వరుణ్ తేజ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా అభిమానుల ముందుకు తీసుకొచ్చాడు. “మీ గుండెల్లో కచ్చితంగా దేశభక్తిని నింపే పాట ఇది” అనే క్యాప్షన్ తో వరుణ్ ఈ పాటను షేర్ చేశాడు. ఈ ఫస్ట్ సింగిల్ తెలుగుతోపాటు హిందీలోనూ రిలీజ్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో వరుణ్ తేజ్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు.
ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్విందర్ సింగ్ పాడారు. ఈ పాటను లాంచ్ చేయడానికి ముందు వరుణ్ తేజ్.. అమృత్‌సర్ లోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్లాడు. ఆ ఫొటోలను మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత వాఘా సరిహద్దులో ఈ పాటను లాంచ్ చేయడం విశేషం. ఈ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ఫిబ్రవరి 16న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ పోషిస్తున్న మానుషి చిల్లార్ ఈ మధ్యే ముంబైలో జరిగిన ఓ కాలేజ్ ఫెస్టివల్లో తన ఫస్ట్ లుక్ రివీల్ చేసింది. ఆరు అంతస్తుల బిల్డింగ్ అంత కటౌట్ లో ఈ లుక్ ఆవిష్కరించడం విశేషం. ఈ ఆపరేషన్ వాలెంటైన్ మూవీని తెలుగుతోపాటు హిందీలోనూ ఒకేసారి షూట్ చేస్తున్నారు. గతేడాదే లావణ్య త్రిపాఠీని పెళ్లి చేసుకున్న వరుణ్.. ఈ మధ్యే మెగా ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాడు.
ఆ తర్వాత వెంటనే ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్లలో బిజీ అయ్యాడు. బుధవారం (జనవరి 17) పంజాబ్ వెళ్లిన వరుణ్.. మొదట గోల్డెన్ టెంపుల్ వెళ్లి తర్వాత వాఘా సరిహద్దు చేరుకున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైనే హిందీలో ఫైటర్ అనే మూవీ జనవరి 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ ఆపరేషన్ వాలెంటైన్ ఏం చేస్తుందో చూడాలి.