Krishna mukunda murari serial january 18th: ముకుంద ప్లాన్ సక్సెస్.. శోభనాన్ని ఆపేసుకున్న కృష్ణ, ఫైర్ అయిన రేవతి

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial january 18th: ముకుందని చూసి ఈ అమ్మాయి ఎంత మారిపోయింది, భవానీ అక్క మారదని అంటుందని కానీ తనని చూస్తుంటే అలా అనిపించడం లేదని రేవతి మనసులో అనుకుంటుంది. కృష్ణని శోభనం కోసం ముకుంద చక్కగా రెడీ చేస్తుంది. తన కోడలిని రెడీ చేసినందుకు ముకుందకి థాంక్స్ చెప్పబోతుంటే వద్దు ఇది నా ప్రాయశ్చిత్తంలో భాగం నేను కృష్ణ, మురారి వాళ్ళకి జీవితాంతం సేవ చేసుకుంటూనే ఉంటానని చెప్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు

కృష్ణ ఇప్పటి వరకు ముకుంద మారలేదని అనుకున్నా కాని ఇప్పుడు నమ్ముతున్నానని చెప్తుంది. లేదు ముకుంద మారింది తన కళ్లలో అపరాధ భావం కనిపిస్తుందని కృష్ణ అంటుంది. మురారికి మధు, గౌతమ్ కంగ్రాట్స్ చెప్తారు. శోభనం గదిని చూసుకుని మురారి తెగ మురిసిపోతాడు. అందరూ కృష్ణ చేతికి పాల గ్లాసు ఇచ్చి గదిలోకి పంపించేందుకు తీసుకుని వెళ్లబోతు ఉంటారు. కృష్ణ భవానీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ దేవుడి నిన్ను చల్లగా చూడాలి. నీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడని అనేసరికి కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఈ క్షణంలో చిరునవ్వు ఉండాలి కన్నీరు కాదని అంటుంది.

శోభనం క్యాన్సిల్ చేసుకున్న కృష్ణ

కృష్ణ ముకుంద ఎక్కడ ఉందని అందరినీ అడుగుతుంది. తను ఒక చోట ఏడుస్తూ నిలబడుతుంది. అది గమనించిన కృష్ణ ముకుంద బాధపడుతుంది ఈ బాధ ఎటు దారి తీస్తుందోనని కంగారు పడుతుంది. అందరూ కృష్ణని గదిలోకి వెళ్ళమని చెప్తారు. కానీ తను మాత్రం ఏసీపీ సర్ గదిలోకి వెళ్లనని చెప్తుంది. ఏమైంది ఎందుకు ఆగారని భవానీ అడుగుతుంది. మధు వెళ్ళి మురారిని పిలుచుకుని వస్తాడు.

అత్తయ్య నన్ను క్షమించండి. ముకుంద ఏడుస్తుందని అంటుంది. ఎదుటి వారి దురదృష్టంలో అదృష్టం వెతుక్కోవడం కరెక్ట్ కాదు. ముకుందని అలాంటి పరిస్థితిలో వదిలి పెట్టి మనం సంతోషంగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ అని కృష్ణ అంటుంది. రేవతి ఆవిడ బాధ ఏంటో కనుక్కోమని భవానీ చెప్తుంది. తన బాధ ఏంటో అందరికీ తెలుసు అడిగి తెలుసుకుంటే గాయం రేపడం తప్ప మరొకటి ఉండదని కృష్ణ చెప్తుంది. అందుకని నువ్వేం చేస్తావని నందు కోపంగా అడిగేసరికి శోభనం ఆపేస్తానని కృష్ణ అంటుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. మురారి ఏంటి ఇదని భవానీ అడిగితే తను చెప్పింది నిజమేనని మురారి కూడా సపోర్ట్ చేస్తాడు. ఆదర్శ్ వచ్చాక అన్ని సర్దుకుంటాయని మురారి అంటాడు.

 

ఆదర్శ్ ని తీసుకొస్తానన్న కృష్ణ

వద్దు వాడిని తీసుకురావద్దు వాడు వస్తే అన్ని సర్దుకుంటాయనే నమ్మకం నాకు లేదు. అదే పరిష్కారం అనుకుంటే దీన్ని ఆపాల్సిన అవసరం లేదని భవానీ చెప్తుంది. ఉంది పెద్దత్తయ్య మనం రొటీన్ జీవితాల్లో పడిపోతే ముకుంద గురించి ఆలోచించేది ఎవరని అంటుంది. మేం ఆలోచిస్తాము మీరు వెళ్లండని రేవతి అంటే ఇంతకాలం వచ్చాడా అని కృష్ణ అంటుంది.

ఇప్పుడు ఆదర్శ్ రావాల్సిన అవసరం ఉంది, తన రాక మీదే మా జీవితాలు ఆధార పడి ఉన్నాయి. ఇవాళ ఇది జరిగిపోయిందని అంటే నేను కూడా ఆదర్శ్, ముకుంద గురించి ఆలోచించను, దయచేసి అర్థం చేసుకొండని కృష్ణ బతిమలాడుతుంది. దీంతో భవానీ సరే అంటుంది. కానీ ఒక్క విషయం ఆదర్శ్ వచ్చాక ఎదురయ్యే పరిస్థితులకి పూర్తి బాధ్యత నీదేనని భవానీ చెప్తుంది.

కృష్ణ మీద ఫైర్ అయిన రేవతి

ఇంకొక సారి ఆలోచించమని శకుంతల అంటే రేవతి మాత్రం కోపంగా వద్దు వదిన ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళకి మనం చెప్పి మన పెద్దరికం పోగొట్టుకున్నట్టేనని అంటుంది. కృష్ణ ముకుంద దగ్గరకి వెళ్తుంది. ముకుంద ఏం తెలియనట్టు నువ్వు ఏంటి ఇక్కడని అడుగుతుంది. నేను ఏసీపీ సర్ కి వద్దని చెప్పాను ఆదర్శ్ వచ్చాకే ముహూర్తమని చెప్పాను. ఇలా మేం సంతోషంగా ఉంటే నీకు ఆదర్శ్ గుర్తుకు వస్తాడని తెలుసు నీ మనసు పాడవుతుందని తెలిసి వద్దని చెప్పానని చెప్తుంది. నా బాధలకి మీ సంతోషం బలిపెట్టడం ఏంటని ముకుంద అంటుంది. ముహూర్తాన్ని వాయిదా వేయొద్దని ముకుంద బతిమలాడుతుంది.

 

ఆదర్శ్ వచ్చాకే అన్నీ అని చెప్తుంది. నీ జీవితానికి అర్థం పరమార్థం ఆదర్శ్ వస్తేనే. నేను ఈ ఇంటి గురించి ఇంట్లో మనుషుల గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది మన ఇద్దరి జీవితాలకి చాలా మంచిది. ఆదర్శ్ ని తెచ్చే వరకు ముహూర్తం పెట్టనివ్వనని కృష్ణ చెప్పేసి వెళ్ళిపోతుంది. తెల్లారి నిద్రలేచిన తర్వాత కృష్ణ మురారిని చూస్తూ ఉంటుంది. సోరి ఏబీసీడీల అబ్బాయి మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను. మీరందరూ ముకుంద అడ్డంకి అనుకున్నారు కాని ఈ సమస్య సాల్వ్ చేయకపోత దాని ప్రభావం కుటుంబం మొత్తం మీద పడుతుందని అర్థం చేసుకోమని మనసులో అనుకుంటుంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024