Best Web Hosting Provider In India 2024
ECI Suspends IAS: ఊహించినట్టే ఎన్నికల సంఘం క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌పై మొదటి వేటు పడింది. ఓటర్ల జాబితాలో అక్రమాలను ఉపేక్షించడం, కలెక్టర్ స్వాధీనంలో ఉండాల్సిన డిజిటల్ లాగిన్ దుర్వినియోగం కావడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఐఏఎస్‌పై చర్యలకు ఉపక్రమించింది.
ట్రెండింగ్ వార్తలు
ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నకిలీ ఓట్ల వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఆలస్యంగా చర్యలు చేపట్టింది. అప్పట్లో తిరుపతి ఆర్వోగా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా ఐఏఎస్ పై సస్పెన్షన్ వేటు వేసింది.
గిరీషా లాగిన్ నుంచి 30 వేలకు పైగా నకిలీ ఓటర్ కార్డులు సృష్టించినట్లు గుర్తించిన ఎన్నికల కమిషన్ గుర్తించింది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న గిరీషా తన లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లను సిబ్బందికి ఇచ్చేయడంతో ఈ అక్రమాలు జరిగాయని ఈసీ గుర్తించింది.
ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓ పక్షానికి కొమ్ముగాయకుండా నిష్పాక్షపతంగా వ్యవహరించాలన్న ఈసీ ఆదేశాలను ఉల్లంఘించిన ఐఏఎస్‌పై వేటు పడింది. తొలి వికెట్‌గా అన్న మయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై వేటు పడింది. తిరుపతి మున్సిపల్ కమిషషనర్‌గా ఉన్న సమయంలో తన లాగిన్, పాస్ వర్డ్‌లను వైసీపీకి చెందిన వ్యక్తులకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి.
తిరుపతి ఉప ఎన్నికలో గిరిషా రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన లాగిన్ ద్వారా 30 వేల ఎపిక్ ఓటర్ ఐడీ కార్డులు డౌన్లోడ్ చేసి, వాటి ద్వారా దొంగ ఓటర్ కార్డులను సృష్టిం చారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో ఈసీ ఆయనపై నిఘా పెట్టింది. ఆయన లాగిన్ నుంచి ఎన్ని వేల కార్డులు డౌన్లోడ్ చేశారు.. ఏయే పేర్లు మార్చారు. ఎన్నిసార్లు లాగిన్ అయ్యారో డేటా మొత్తం సేకరించింది.
జనవరి 9, 10వ తేదీల్లో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావే శంలో ఈ విషయాన్ని సీఈసీ బయటపెట్టారు. గిరిషా లాగిన్ నుంచి వేల ఐడీలు ఎందుకు డౌన్‌లోడ్ అయ్యాయని అందరి ముందు ప్రశ్నించారు. దీనిపై తనకు తెలియదని సమాధానం ఇచ్చినా ఈసీ సంతృప్తి చెందలేదు.
ఈసీ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఈసీ లాగిన్ మీ వద్దనే ఉందా లేదా.. ఎన్నికల సంఘం నిలదీశారు. లాగిన్ నుంచి 30 వేల మందికి సంబంధించిన కార్డులు డౌన్లోడ్ చేసిన విషయం మీకు తెలుసా అని ప్రశ్నించడంతో ఆయన మౌనం వహించారు. ఆ కార్డుల ఆధారంగా అనేక దొంగ ఓటర్ కార్డు లను సృష్టించారని ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా పార్టీ పక్షపాతం ఉంటే వెంటనే విధుల్లో నుంచి తప్పుకోవాలని హెచ్చరించింది.
ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకోవాలని, ఇప్పుడు మాత్రం తమ నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. సమావేశం తర్వాత గిరీషాపై ఈసీ వేటు వస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ఈసీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కి ముఖేష్ కుమార్ మీనాకు పంపారు.
ప్రస్తుతం గిరీషా మూడు రోజుల నుంచి సెలవులో ఉన్నారు. గురువారం ఉదయం విధుల్లో చేరాల్సి ఉండగా ఈసీ సస్సెండ్ చేసింది. ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త కలెక్టర్ను నియమించాల్సి ఉంటుంది. మరికొందరి ఐఏఎస్, ఐపీఎస్‌లపై కూడా ఈసీ చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలకు చెందిన నలుగురైదుగురు అధికారుల వివరణల ఆధారంగా ఈసీ వేటు పడుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన అధికారులపై ఈసీ చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.
టాపిక్