Best Web Hosting Provider In India 2024

Chiranjeevi Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పద్మవిభూషణ్ అవార్డుకు చిరంజీవి ఎంపికైనట్లు తెలిసింది. చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డుపై రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది పద్మ అవార్డ్స్ లిస్ట్‌లో చిరంజీవి పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
లాక్‌డౌన్ టైమ్‌లో…
కొవిడ్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి మోదీ ప్రభుత్వం మెగాస్టార్‌ను పద్మవిభూషణ్‌తో సత్కరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లాక్‌డౌన్ టైమ్‌లో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు చిరంజీవి. సినీ కార్మికులతో పాటు కొవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన సామన్య ప్రజలను ఆదుకునేందుకు అంబులెన్స్, ఆక్సిజన్ సదుపాయాలను ఉచితంగా కల్పించారు.
సినీ పరిశ్రమతో పాటు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ అవార్డును అందజేయబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. 2006లో ఈ అవార్డును స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పద్మభూషణ్ అందుకున్నారు చిరంజీవి.. ఇప్పుడు బీజీపీ ప్రభుత్వం ఆయన్ని పద్మవిభూషణ్‌తో సత్కరించనుంది. చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన వార్త టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్‌లో సంబరాలు మొదలయ్యాయి.
విశ్వంభరతో బిజీ…
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీతో బిజీగా ఉన్నాడు. ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. వంద కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ విశ్వంభర మూవీని నిర్మిస్తున్నారు. విశ్వంభరలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో నటిస్తారని చెబుతున్నారు. వారు ఎవరన్నది త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలిసింది.
కళ్యాణ్ కృష్ణతో…
విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లో 156వ మూవీ ఇది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిగింది. విశ్వంభర తర్వాత బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు చిరంజీవి కూతురు సుస్మితా కొణిదెల ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని కథల్ని చిరు వింటున్నట్లు సమాచారం.
వాల్తేర్ వీరయ్య బ్లాక్‌బస్టర్…
గత ఏడాది చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, భోళా శంకర్ సినిమాలు రిలీజయ్యాయి. సంక్రాంతికి రిలీజైన వాల్తేర్ వీరయ్య ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. బాబీ దర్శకత్వంలో రూపొందిన 150 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. గత ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. భోళాశంకర్‌కు మాత్రం చిరంజీవికి చేదు ఫలితాన్ని మిగిల్చింది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అవుట్‌డేటెడ్ స్టోరీ కారణంగా డిజాస్టర్ గా నిలిచింది.