ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే స్పెష‌లిస్ట్ వైద్యులు..ఇది సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌త‌

Best Web Hosting Provider In India 2024

మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి

మార్కాపురం:  ప్రజల వద్దకే స్పెషలిస్ట్‌ వైద్యులు వచ్చి మెరుగైన సేవలు అందించేలా చేసిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే అని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి రెండో విడత నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మార్కాపురం 3వ సచివాలయం పరిధిలోని 3, 4, 6, 7, 8న వార్డుల్లో ప్రజలకు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంత‌రం తన క్యాంపు కార్యాలయంలో మార్కాపురం పట్టణ, రూరల్‌, తుర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి టౌన్‌, రూరల్‌ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలో సమావేశమైన ఎమ్మెల్యే.. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరగనున్న ‘సామాజిక న్యాయ మహా శిల్పం’ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డాక్టర్‌బీఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగించేందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. 

Best Web Hosting Provider In India 2024