Tirumala Tickets : భక్తులకు అలర్ట్… శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Best Web Hosting Provider In India 2024

Tirumala Tirupati Devasthanam Updates: శ్రీవారి దర్శన టికెట్లకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏప్రిల్​ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణం, ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు బుకింగ్​కు సంబంధించిన షెడ్యూల్​ను బుధవారం ప్రకటించింది టీటీడీ. ఇందులో భాగంగా…ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఇవాళ్టి నుంచి బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ టికెట్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

మిగతా సేవల టికెట్లు – షెడ్యూల్ ఇదే

-కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

-వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

-శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు జరుగునుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

-ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

-శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

-వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

-ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు.

-తిరుమ‌ల‌, తిరుప‌తిలో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

-ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.

https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో పైన పేర్కొన్న అన్నిరకాల సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.

WhatsApp channel

టాపిక్

TtdAndhra Pradesh NewsTrending ApDevotional NewsDevotional
Source / Credits

Best Web Hosting Provider In India 2024