
Best Web Hosting Provider In India 2024

TSRTC Recruitment Notification 2024: తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్టీసీ. ఇందులో వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ తో పాటు పలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో వీటిని భర్తీ చేయనున్నారు. జనవరి 23వ తేదీన తార్నకలోని కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్య్వూలు నిర్వహించడం జరుగుతోందని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు.
ట్రెండింగ్ వార్తలు
రూ.40 లక్షల ఆర్థిక సాయం
రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ ఆర్టీసీ అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించింది. హైదరాబాద్ బస్ భవన్ లో గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తాండూరు డిపో కండక్టర్ లక్ష్మణ్ కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెక్కును యూబీఐ అధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అందజేశారు.
తాండూరు డిపోనకు చెందిన కండక్టర్ లక్ష్మణ్ రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. శిక్షణకు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్తుండగా ద్విచక్రవాహనం ఢీకొని ఆయన మృతి చెందారు. హైదరాబాద్ శివారు హకీంపేటలో గత ఏడాది జూన్ 22న జరిగిందీ ప్రమాదం. ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40లక్షలు వరకు యూబీఐ అందజేస్తోంది. రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించడంపై టీఎస్ఆర్టీసీ, యూబీఐకి కండక్టర్ లక్ష్మణ్ భార్య జ్యోతి, కుమారుడు అనిల్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఈడీ ఎస్.కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీపీఎం ఉషాదేవి, యూబీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, తాండూరు బ్రాంచీ మేనేజర్ అరుణ్ కుమార్, రంగారెడ్డి డిప్యూటీ ఆర్ఎం రాజు, తాండూరు డీఎం సమత, తదితరులు పాల్గొన్నారు.
టాపిక్