Dondakaya Pakodi: దొండకాయ పకోడి ఇలా స్పైసీగా చేసుకుంటే నోరూరిపోవడం ఖాయం

Best Web Hosting Provider In India 2024

Dondakaya Pakodi: చలి కాలంలో వేడి వేడి పకోడీలు తినాలని అందరికీ ఉంటుంది. ఎప్పుడూ ఉల్లిపాయ పకోడి, బజ్జీలు తిని బోరుకొడితే ఓసారి… దొండకాయ పకోడి ప్రయత్నించి చూడండి. ఇవి రుచిగా ఉంటాయి. పైగా కూరగాయలతో చేసినవి కాబట్టి టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని చేయడం చాలా సులువు. పిల్లల చేత తినిపించడం కూడా చాలా ముఖ్యం. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం

ట్రెండింగ్ వార్తలు

దొండకాయ పకోడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

దొండకాయలు – పావు కిలో

శెనగపిండి – ఒక కప్పు

కార్న్ ఫ్లోర్ – ఒక స్పూను

పచ్చి మిర్చి – మూడు

జీలకర్ర – ఒక స్పూను

కొత్తి మీర – ఒక కట్ట

నూనె – వేయించడానికి సరిపడా

దొండకాయ పకోడి రెసిపీ

1. దొండకాయల్ని శుభ్రంగా కడిగి నిలువుగా, సన్నగా కోసుకోవాలి.

2. ఇప్పుడు ఒక గిన్నెలో కోసిన దొండకాయలను వేయాలి.

3. ఆ గిన్నెలో శెనగపిండి, పచ్చిమిర్చి తరుగు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కొత్తిమీర తరుగు, జీలకర్ర వేసి బాగా కలపాలి

4. అందులో అవసరం అయితే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. నూనె బాగా వేడెక్కాక అందులో దొండకాయల మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. వీటిని సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

7. సాయంత్రం పూట వీటిని వేడివేడిగా తింటే టేస్టీగా ఉంటాయి.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024