మేన‌ల్లుడి నిశ్చితార్థానికి హాజరైన సీఎం వైయ‌స్ జగన్‌ దంపతులు

Best Web Hosting Provider In India 2024

 

నూత‌న దంప‌తులు రాజారెడ్డి, ప్రియల‌ను ఆశీర్వ‌దించిన‌ సీఎం వైయ‌స్ జగన్ 

హైద‌రాబాద్ :   ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చి­తార్థ వేడుకకు హాజరయ్యారు. రాజారెడ్డి, ప్రియ నిశ్చి­తార్థ వే­డుకలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు, వైయ‌స్ విజ‌య‌మ్మ‌ పాల్గొని నూ­తన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్లు వైవీ సుబ్బారెడ్డి, స‌స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి  ఉన్నారు.

గండిపేటలో నిశ్చితార్థం
గండిపే­టలోని గోల్కొండ రి­సార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరుగుతోంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్‌ ఎకనామిక్స్‌ & ప్రిడిక్టివ్‌ అనలటిక్స్‌లో MS పూర్తి చేసి యూనివ‌ర్సిటీ నుంచి ప‌ట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవాళ‌ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది.

Best Web Hosting Provider In India 2024