Fluffy Omelette: బ్రేక్‌ఫాస్ట్ లో ఇలాంటి ప్లఫీ ఆమ్లెట్ తినండి, టేస్ట్ సూపర్ గా ఉంటుంది

Best Web Hosting Provider In India 2024

Fluffy Omelette: మనదేశంలో ఆమ్లెట్ అనగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అట్టులా పోసుకొని తింటూ ఉంటారు. కానీ విదేశాల్లో ఆమ్లెట్లను ఫ్లఫీగా వేస్తారు. అవి మెత్తగా, టేస్టీగా ఉంటాయి. తినాలన్న కోరిక కూడా పెరుగుతుంది. ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్స్ తినేవారు… ఈసారి ఆమ్లెట్లను ప్రయత్నించండి. ఇది పిల్లలకు కూడా బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్‌లో కోడిగుడ్లు తినడం వల్ల ఆ రోజంతా మీకు శక్తి అందుతుంది. నీరసపడకుండా ఉంటారు. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎలాగో చూద్దాం.

 

ట్రెండింగ్ వార్తలు

ఫ్లఫీ ఆమ్లెట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కోడిగుడ్లు – మూడు

వెల్లుల్లి తరుగు – రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

క్యాప్సికం తరుగు – ఒక స్పూను

మిరియాల పొడి – అర స్పూను

ఉప్పు- రుచికి సరిపడా

నూనె – ఒక స్పూను

ఫ్లఫీ ఆమ్లెట్ రెసిపీ

1. ఒక గిన్నెలో మూడు గుడ్లను వేసి బాగా గిలగొట్టాలి. ఎంతగా అంటే గుడ్ల నుంచి నురుగు వచ్చేలా గిలకొట్టాలి.

2. ఇలా గిలక్కొట్టడం వల్లే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది.

3. ఇప్పుడు ఆ గుడ్ల మిశ్రమంలో సన్నగా తరిగిన వెల్లుల్లిని, కొత్తిమీర తరుగును వేసి బాగా కలుపుకోవాలి.

4. అందులోనే మిరియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలపాలి. బ్లెండర్ తో మళ్లీ బాగా గిలకొట్టాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఒక టీ స్పూన్ నూనె వేయాలి.

6. గిలకొట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసి అట్టులా పోయాలి.

7. రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టాలి. చిన్న మంట మీద ఉడికించాలి.

8. ఇప్పుడు మూత తీసి పైన క్యాప్సికం తరుగును చల్లాలి.

9. చిన్న మంట మీద ఉంచితే ఆమ్లెట్ ఉబ్బినట్టు వస్తుంది.

10. చాలా మెత్తగా ఉంటుంది. ఈ ప్లఫీ ఆమ్లెట్‌ను తింటే రోజంతా శక్తి అందుతుంది.

 

11. పిల్లలకు మంచి బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఇది అని చెప్పుకోవచ్చు.

12. కోడిగుడ్లు తినడం వల్ల ఆరోగ్యమే, కాబట్టి ఫ్లఫీ ఆమ్లెట్లు కూడా తినడం వల్ల మంచే జరుగుతుంది.

13. ఇందులో మిరియాల పొడి, క్యాప్సికం, వెల్లుల్లి వంటివన్నీ వాడాం, కాబట్టి వాటిలోని పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024