Dhruva NakshatramRelease:విక్ర‌మ్ ధృవ న‌క్ష‌త్రం ఈసారైన వ‌స్తుందా? కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

Best Web Hosting Provider In India 2024

Dhruva NakshatramRelease: విక్ర‌మ్ ధృవ న‌క్ష‌త్రం రిలీజ్ డేట్‌పై సోష‌ల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎలాంటి అవంత‌రాలు లేకుండా ఈ సారి ధృవ న‌క్ష‌త్రం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం ప‌క్కా అని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఫిబ్ర‌వ‌రి నెల‌లో ఆ స్పై యాక్ష‌న్ మూవీ విడుద‌ల‌ కాబోతున్న‌ట్లు స‌మాచారం. ఫిబ్ర‌వ‌రి 16 లేదా 23ల‌లో ఏదో ఒక రోజు ఈ మూవీ రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏ తేదీన ధృవ న‌క్ష‌త్రం విడుద‌ల‌ అవుతుంద‌న్న‌ది త్వ‌ర‌లోనే ఫైన‌ల్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు

2023లో రిలీజ్ కావాలి కానీ…

2023 న‌వంబ‌ర్ 24 ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. తెలుగు త‌మిళ భాష‌ల్లో ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించారు. ఓవ‌ర్‌సీస్‌లో కొన్ని చోట్ల ప్రీమియ‌ర్స్‌ను స్క్రీనింగ్ చేశారు. కానీ ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్ కార‌ణంగా ధృవ‌న‌క్ష‌త్రం వాయిదాప‌డింది. రిలీజ్ రోజు కూడా ఈ స‌మ‌స్య‌ల‌ను క్లియ‌ర్ చేసేందుకు డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ చాలా ప్ర‌య‌త్నించారు. కానీ అవి సాల్వ్ కావ‌డంతో సినిమాను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ధృవ న‌క్ష‌త్రం రిలీజ్‌కు సంబంధించిన అడ్డంకుల‌ను క్లియ‌ర్ చేసే ప‌నిలో గౌత‌మ్ మీన‌న్ బిజీగా ఉన్న‌ట్లు స‌మాచారం.

సూర్య‌తో అనుకొని…

ధృవ న‌క్ష‌త్రం సినిమాను 2015లో సూర్య‌తో అనౌన్స్‌చేశాడు డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్‌. కానీ స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో సూర్య ఈ మూవీ నుంచి త‌ప్పుకున్నాడు. ఆ త‌ర్వాత 2017లో విక్ర‌మ్‌తో ఈ మూవీని మొద‌లుపెట్టాడు గౌత‌మ్ మీన‌న్‌. అదే ఏడాది షూటింగ్‌ను పూర్తిచేసి రిలీజ్ చేయాల‌ని అనుకున్నాడు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఏడేళ్ల పాటు ఈ సినిమా రిలీజ్ కాలేదు.

ఇప్ప‌టికే ఆరు సార్లు ధృవ న‌క్ష‌త్రం రిలీజ్ వాయిదాప‌డింది. ఈ సారి కూడా రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని విక్ర‌మ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విక్ర‌మ్ కూడా ఈ సినిమా రిలీజ్‌పై ఆశ‌లు వ‌ద‌లుకున్నాడు. ధృవ న‌క్ష‌త్రం ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉంటోన్నాడు. ఫిబ్ర‌వ‌రిలోనైనా ఈ మూవీ రిలీజ్ అవుతుందా అన్న‌ది చూడాల్సిందేన‌ని విక్ర‌మ్ ఫ్యాన్స్ అంటోన్నారు. గౌత‌మ్ మీన‌న్‌, విక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రాబోతున్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

 

రీతూ వ‌ర్మ హీరోయిన్‌…

ధృవ‌న‌క్ష‌త్రం సినిమాలో రీతూవ‌ర్మ‌, సిమ్ర‌న్‌, రాధిక శ‌ర‌త్‌కుమార్‌, పార్తిబ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి హ‌రీస్ జ‌య‌రాజ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. ధృవ న‌క్ష‌త్రం స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ది. డైరెక్ట్‌గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయ‌డం మంచిదంటూ కొంద‌రు నెటిజ‌న్లు చెబుతోన్నారు.

తాంగ‌లాన్ కూడా పోస్ట్‌పోన్‌…

గ‌త ఏడాది పొన్నియ‌న్ సెల్వ‌న్‌తో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న చియాన్ విక్ర‌మ్ ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ పా రంజిత్‌తో తాంగ‌లాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఓ ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో విక్ర‌మ్ క‌నిపించ‌బోతున్నాడు. తొలుత జ‌న‌వ‌రి 26న తాంగ‌లాన్‌ను రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కంప్లీట్ కాక‌పోవ‌డంతో ఏప్రిల్‌కు ఈ మూవీ వాయిదాప‌డింది. తాంగ‌లాన్‌తో పాటు సిద్ధార్థ్ చిన్నా డైరెక్ట‌ర్ అరుణ్‌కుమార్‌తో విక్ర‌మ్ ఓ ఎమోష‌న‌ల్ డ్రామా మూవీ చేస్తోన్నాడు.

WhatsApp channel
 

టాపిక్

 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024