Best Web Hosting Provider In India 2024
TSRTC Latest Recruitment 2024 : తెలంగాణ ఆర్టీసీ మరో ఉద్యోగ ప్రకటన చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న డిపోల్లో అప్రెంటిస్ శిక్షణ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులైన నాన్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ కు అర్హులు. పూర్తి వివరాలకి టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtc.telangana.gov.in ని సంప్రదించాలని సూచించింది. మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనుంది.
ట్రెండింగ్ వార్తలు
రీజియన్లలోని ఖాళీలు – ముఖ్య వివరాలు:
1. హైదరాబాద్ రీజియన్- 26
2. సికింద్రాబాద్ రీజియన్- 18
3. మహబూబ్ నగర్ రీజియన్- 14
4. మెదక్ రీజియన్- 12
5. నల్గొండ రీజియన్- 12
6. రంగారెడ్డి రీజియన్- 12
7. ఆదిలాబాద్ రీజియన్- 09
8. కరీంనగర్ రీజియన్- 15
9. ఖమ్మం రీజియన్- 09
10. నిజామాబాద్ రీజియన్- 09
11. వరంగల్ రీజియన్- 14
– ఖాళీల భర్తీలో రిజర్వేషన్లను అమలు చేస్తారు.
-బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
-21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
– శిక్షణ వ్యవధి మూడేళ్లుగా ఉంటుంది.
-మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000 స్టైఫండ్ చెల్లిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది 16 ఫిబ్రవరి 2024.
దరఖాస్తు సమర్పణకు ముందు www.nats.education.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ – http://tsrtc.telangana.gov.in
నర్సింగ్ కాలేజీలో ఖాళీలు – ఆర్టీసీ ప్రకటన
TSRTC Recruitment Notification 2024: తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్టీసీ. ఇందులో వైస్ ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్ తో పాటు పలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో వీటిని భర్తీ చేయనున్నారు. జనవరి 23వ తేదీన తార్నకలోని కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్య్వూలు నిర్వహించడం జరుగుతోందని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు.
టాపిక్