Gaami OTT Release: ఓటీటీలోకి విజువల్ వండర్ మూవీ గామి.. ఆరోజే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Gaami OTT Release Date: వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇటీవల దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ సేన్ ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే టాక్ షోతో కూడా ఆకట్టున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విశ్వక్ సేన్ అంతకంటే ముందే గామి సినిమాతో ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ యూనిక్ మూవీ గామి.

ట్రెండింగ్ వార్తలు

గామి సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే టాలీవుడ్‌లో విద్యాధర్ కాగిత డైరెక్టర్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం (మార్చి 8) అంటే మహా శివరాత్రి సందర్భంగా గామి సినిమా థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదలైంది. దానికంటే ముందే అమెరికా, యూకే వంటి దేశాల్లో గామి ప్రీమియర్ షోలు పడ్డాయి. దాంతో గామి సినిమాపై ఫుల్ పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. సినిమా విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయని నెటిజన్స్ రివ్యూలు ఇచ్చారు.

అలాగే గామిలో నరేష్ కుమారన్ అందించిన సంగీతం, బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయని ప్రశంసలు కురిపించారు నెటిజన్ ఆడియెన్స్. ఈ నేపథ్యంలో గామి ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. గామి ఓటీటీ హక్కులను (Gaami OTT Rights) ప్రముఖ సంస్థ జీ5 (ZEE5) కొనుగోలు చేసింది. గామి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు (OTT Platforms) భారీగానే పోటీ పడినట్లు సమాచారం. వాటన్నింటిని దాటుకుని ఫైనల్‌గా భారీ వ్యయం వెచ్చించి గామి ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుందట.

అలాగే గామి సినిమాను నెల రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ (Gaami Digital Streaming) చేసేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే, మార్చి 8న విడుదలైన గామి మూవీని ఎప్రిల్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే, నెల రోజులకు కాకుండా గామి మూవీ రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్లను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్‌పై మార్పులు జరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే జీ5 సంస్థ కొనుగోలు చేసిన హనుమాన్ మూవీని మార్చి 8న ఓటీటీ రిలీజ్ చేస్తామని టాక్ నడిచింది. కానీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అలా ఓటీటీలోకి వచ్చేవరకు గామి సినిమా డిజిటల్ ప్రీమియర్‌పై క్లారిటీ లేదనే చెప్పుకోవచ్చు. కానీ, అన్ని సినిమాలకు అలా జరగాల్సిన అవకాశం కూడా లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా గామి మూవీ మాత్రం దాదాపుగా ఏప్రిల్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువని సమాచారం.

కాగా గామి శాటిలైట్ హక్కులను బుల్లితెర సంస్థ జీ తెలుగు సొంతం చేసుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ స్ట్రీమింగ్ అనంతరం బుల్లితెరపై అంటే టెలివిజన్‌లో గామిని ప్రసారం చేయనున్నారు. ఇక పోతే గామి సినిమాలో హీరోయిన్‌గా చాందిని చౌదరి నటించింది. ఎంజీ అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్ కీలక పాత్రల్లో నటించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024