సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో ప‌లువురు టీడీపీ, బీజేపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

Best Web Hosting Provider In India 2024

 

పార్టీ నేత‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ప‌లువురు టీడీపీ, బీజేపీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  చీకటిమునిపల్లె స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో  భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఏ వీ సుబ్బారెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

చీకటిమునిపల్లి స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్‌ అహ్మద్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

చీకటిమునిపల్లె స్టే పాయింట్‌ వద్ద కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత ఎం. గంగాధర్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చీకటిమునిపల్లె స్టే పాయింట్‌ వద్ద శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు చెందిన ప‌లువురు నేత‌లు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

పార్టీ నేత‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం
చీకటిమునిపల్లె స్టే పాయింట్‌ వద్ద పలువురు పార్టీ నేతలు, సీనియర్‌ కార్యకర్తలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేరుపేరునా పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నిక‌ల‌పై పార్టీ నేతలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

Best Web Hosting Provider In India 2024