NNS April 4th Episode: తన జీవితాన్నే కథగా చెప్పిన అరుంధతి.. మనోహరి టెన్షన్.. రౌడీ బెదిరింపు

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 4th April Episode) తమ కుటుంబానికి ప్రేమగా వడ్డిస్తున్న మిస్సమ్మని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మా అలవాట్లన్నీ నీకెలా తెలుసు మిస్సమ్మ అంటుంది నిర్మల. ఎలా మర్చిపోతాను అత్తయ్య అంటుంది భాగమతి. ఆంటీ నీకు అత్తయ్య ఏంటి మిస్సమ్మ అంటుంది మనోహరి. మా అత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్లి మా అత్తయ్యను.. అత్తయ్య.. అత్తయ్య.. అని పిలిచి అలవాటులో పొరపాటుగా అలా పిలిచేశాను సారీ ఆంటీ అని చెబుతుంది భాగమతి.

 

ఎందుకలా ప్రవరిస్తుంది

పర్వాలేదులే మా అని నిర్మల అంటుంది. ఇంతలో అమర్​కి పొలమారుతుంది. ఏమండీ మంచినీళ్లు తాగండి అని నెత్తి మీద కొడుతూ మంచి నీళ్లు ఇస్తుంది భాగమతి. మనోహరి అది చూడలేక గ్లాస్ కింద పడేస్తుంది. ఏమైంది మనోహరి అంటాడు శివరామ్. గ్లాస్ కింద పడిపోయింది అంకుల్ నీలా గ్లాస్ తియ్యి అని కోపంగా అంటుంది మనోహరి. అసలేం జరిగింది ఎందుకలా ప్రవర్తిస్తుంది. అక్కాచెల్లెళ్లు ఒక్కటై వచ్చినా సరే అమర్‌తో నా పెళ్లి ఆపలేరు అని మనోహరి అనుకుంటూ ఉండగా డ్రైవర్ ఫోన్ చేస్తాడు.

మేడం పెళ్లి పీటలు ఎక్కడానికి అంత సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఆయనతో పెళ్లి పీటలు ఎక్కాలంటే నాకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయారా అని ఆ రౌడీ అంటాడు. పంపిస్తానన్నాను కదా అని మనోహరి అంటుంది. నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం ఏం చేస్తానో నీకు తెలుసు కదా అని అ రౌడీ అంటాడు. రేయ్ బెదిరిస్తున్నావా ఎన్నిసార్లు చెప్పాను ఇస్తానని రేపు పొద్దున్నే వచ్చి నగలు తీసుకుని అమర్‌కి కనిపించనంత దూరం పారిపో అని మనోహరి ఉంటుంది.

 

మీరిద్దరు ఒక్కటైనా

మేడం మీరు ఆయనని పెళ్లి చేసుకోవాలన్న నేను పారిపోవాలి అన్న రేపు ఒకటే రోజు మిగిలి ఉంది. మీరు ఆ కుటుంబాన్ని ఏం చేస్తారో నాకు అనవసరం నా డబ్బు నాకు పంపిస్తే నేను వెళ్లిపోతాను అని ఆ రౌడీ ఫోన్ కట్ చేస్తాడు. కోపంతో రగిలిపోతున్న మనోహరి భాగమతి చేస్తున్న పనులను గుర్తుకు తెచ్చుకొని అక్క చెల్లెలు ఒక్కటై ఇలా చేయాలని చూస్తున్నారా మీరిద్దరూ ఒక్కటై ఏం చేసినా అమర్‌తో పెళ్లి ఆపలేరు. ఒసేయ్ అరుంధతి నాకేదురుగా రావే నువ్వు నేను తేల్చుకుందాం నువ్వు ఓడిపోతే నీ పిల్లలని నీ కుటుంబాన్ని నాశనం చేసి నీలాగే నీ పిల్లలని అనాధల్ని చేస్తాను గుర్తుపెట్టుకో అని మనోహరి అంటుంది.

కట్ చేస్తే, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. పిల్లలు ఆడుకుంటూ ఉండగా చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది భాగమతి. పిల్లలు ఇంకా ఎంతసేపు ఆడుతారు పడుకోండి అని భాగమతి అంటుంది. మిస్సమ్మ మా అమ్మ పడుకునేటప్పుడు మాకు ఒక కథ చెప్పేది కథ చెప్పవా అంటుంది అంజలి. భాగమతి పిల్లలకి కథ చెబుతుంది. తన కథ తనే చెప్పుకుంటుంది. అనగనగా ఒక పాప ఉండేది ఆ పాప అడవిలో అమ్మానాన్న లేక అనాధల పెరిగింది. ఆ పాప పెరిగి పెద్దవుతూ ఉండగా ఒక స్నేహం మొదలయ్యింది.

 

అనాధగా మిగిలిపోయింది

అ స్నేహాన్ని కుటుంబంగా భావించింది. ఆ పాప పెరిగి పెద్దయ్యాక ఒక రాజకుమారుడు తన జీవితంలోకి వచ్చాడు. తనని కొత్త లోకంలోకి తీసుకువెళ్లాడు. ఆ అమ్మాయి జీవితం ఆనందంగా సాగిపోతుంది అనుకునే సమయానికి ఒక దుష్ట శక్తి ప్రవేశించి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మళ్లీ ఆ అమ్మాయి ఒంటరిగా అనాధగా మిగిలిపోయింది. ఆ అమ్మాయి లేని జీవితాన్ని ఊహించుకోలేక కుటుంబమంతా బాధపడుతుంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ భాగమతి కథ చెప్తూ ఉండగా పిల్లలు నిద్రపోతారు.

అమర్​ తన రూమ్‌లోకి వస్తాడు. తన రూమ్‌ని అరుంధతి లాగా సద్ది పెట్టడం చూసి అరుంధతిని గుర్తుకు తెచ్చుకుంటాడు అమరేంద్ర. భాగమతి చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది. తనకోసం పెట్టిన స్వీట్ తింటూ ఉంటాడు అమర్​. అక్కడే ఉన్న బుక్ చూసి పక్కన పెట్టి పడుకుంటాడు అమరేంద్ర. ఇంతలో మనోహరి వచ్చి చూసేసరికి అమర్​ పడుకొని ఉంటాడు. తన కళ్లకి భాగమతి కనబడుతుంది. మళ్లీ చూసేసరికి మాయమైపోతుంది భాగమతి.

బుర్ర ఖరాబయిందా?

ఇప్పుడే అక్కడ భాగీ ని చూశాను ఇప్పుడు లేదేంటి నేను ఊహించుకున్నాను అని అమర్ అంటాడు. పెళ్లి గురించి ఆలోచించి ఆలోచించి నీ బుర్ర ఖరాబయిందా అని మనోహరి డోర్ వేసి వెళ్లిపోతుంది.

 

మనోహరి వెళ్లిపోగానే భాగమతి అమరేంద్ర దగ్గరికి వచ్చి బెడ్ షీట్ కప్పి తనని ముట్టుకోవాలని చూస్తుంది. అమర్​ చెయ్యి మీద చేయి పెడుతుంది భాగమతి. అమర్​ తన మీద ఇంకో చేయి వేసి పడుకుంటాడు. అమర్​ మొహం మీద గాలి ఊదగానే అమరేంద్ర చెయ్యి తీసేస్తాడు.

అరుంధతి ఏం చేస్తుంది?

తను చెయ్యి తీసుకొని బాధపడుతుంది భాగమతి. లేచి తన కాళ్లని పట్టుకొని కింద కూర్చొని గట్టిగా అక్కడే పడుకుంటుంది. భాగమతి ఒంట్లో నుంచి బయటికి వస్తుంది అరుంధతి.. తనను తాను చూసుకొని బాధపడాలో ఏడవలో అర్థం కాక అమర్​ని చూస్తూ నిలబడుతుంది. మనోహరి, అమర్​ పెళ్లి ఆపడానికి భాగమతి రూపంలో ఉన్న అరుంధతి ఏం చేయబోతోంది? తెలియాలంటే ఏప్రిల్ 5న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024