Krishna mukunda murari serial may 4th episode: మురారికి నిజం చెప్పేసిన మీరా.. ముకుంద, ఆదర్శ్ కి పెళ్లి చేద్దామన్న భవానీ

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari serial may 4th episode: ఆదర్శ్ ముకుందని పిలిచి షాపింగ్ కి వెళ్దామని అంటాడు. మనసులో ఆదర్శ్ ని తెగ తిట్టేస్తుంది. బట్టలు నీకోసం కొంటాను. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొన్నే కట్టుకుంటున్నావ్. అది నాకు నచ్చలేదు అందుకే నేను నీకు బట్టలు కొంటానని అంటాడు.

ఆదర్శ్ కి పడిపోయిన ముకుంద

మీది ఎంత మంచి మనసు ఆదర్శ్. నేను ముకుందగా ఉన్నప్పుడు కూడా నా మీద ఎవరూ ఇంతగా శ్రద్ధ చూపించలేదు. కానీ అదంతా వృధానే. ఈ జన్మకి నా మనసులో మురారికి తప్ప వేరొకరికి చోటు ఉండదని ముకుంద మనసులో అనుకుంటుంది. నేను ముకుందని కాకపోయి ఉంటే ఎప్పుడో మీకు పడిపోయి ఉండేదాన్ని అనుకుంటుంది.

కృష్ణకి వైదేహి ఫోన్ చేసి గుడ్ న్యూస్ అంటుంది. సరోగసి మథర్ తో మాట్లాడాను ఒప్పుకుందని హాస్పిటల్ కి వస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని చెప్తుంది. కృష్ణ చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడే భవానీ పాలు తీసుకుని వస్తుంది.

మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నా. నిజం తెలిస్తే మీ ప్రేమ అంతా అసహ్యంగా మారుతుందని కృష్ణ బాధపడుతుంది. ఆదర్శ్, మీరా పెళ్లి గురించి నీ అభిప్రాయం అడిగాను కదా నీ అభిప్రాయం ఏంటని భవానీ అడుగుతుంది. వాళ్ళ అభిప్రాయం ఏంటో అడిగారా అని కృష్ణ అంటుంది.

ఆదర్శ్, ముకుందకు పెళ్లి చేద్దాం

ఇప్పుడే చూశాను వాళ్ళిద్దరూ షాపింగ్ కి వెళ్లాలని మాట్లాడుకుంటున్నారు. నువ్వు నేను ముకుంద గురించి ఆలోచించలేదు కానీ ఆదర్శ్ ఆలోచించాడు. ముకుందకి కూడా ఎవరూ లేరు నీలాగే మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది. పెళ్లి చేస్తే బాగుంటుందని భవానీ అంటుంది.

హాస్పటిల్ కి వెళ్తున్నామని కృష్ణ అంటే తాను కూడా వస్తానని భవానీ అనేసరికి షాక్ అవుతుంది. ఇక నుంచి నేనే దగ్గరుండి చూసుకుంటానని చెప్తుంది. ఎక్కడికని మురారి అడుగుతాడు. హాస్పిటల్ కి వస్తాను కడుపులో బిడ్డకి ఎలా ఉందో తెలుసుకుంటానని అంటుంది.

మురారి మాత్రం భవానీని వద్దని చెప్పి రాకుండా ఒప్పిస్తాడు. మురారి మాటలకు కన్వీన్స్ అవుతుంది. భవానీ కృష్ణకి జాగ్రత్తలు చెప్తుంది. ఇంత ప్రేమని పొందే అదృష్టాన్ని ఇచ్చిన దేవుడు దాన్ని పొందే అర్హత తనకి లేదని కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

సరోగసి మథర్ దొరికింది

డాక్టర్ వైదేహి ఫోన్ చేసిందని సరోగసి మథర్ దొరికిందని కృష్ణ మురారికి చెప్తుంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్ కి బయల్దేరతారు. భవానీ తన మీద చూపిస్తున్న ప్రేమ గుర్తు చేసుకుని కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ద్వేషం మాత్రమే కాదు ప్రేమ కూడా ఒక్కోసారి బాధని మిగులుస్తుందని అంటుంది.

నేను తల్లిని కాబోతున్నానని ఎంత ప్రేమ చూపిస్తు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాళ్ళని దారుణంగా మోసం చేస్తున్నాననే బాధగా ఉందని అంటుంది. మనం ఎవరిని మోసం చేయడం లేదు. ఏదైనా కొన్ని రోజులు భరించాలని మురారి సర్ది చెప్తాడు.

మనం ఇప్పుడు ఆలోచించాల్సింది అది కాదు సరోగసి మథర్ ఎలాంటిది తను మన బిడ్డని సరిగా చూసుకుంటుందో లేదో అది ఆలోచించాలని అంటాడు. దారిలో మురారి కారు ఆపుతాడు. కొబ్బరి బోండాం తీసుకుని వచ్చేసరికి కృష్ణ కారులో ఉండదు. మురారి కంగారుగా తన కోసం వెతుకుతాడు.

పిల్లలని దత్తత తీసుకుందామా

కృష్ణ అనాథ ఆశ్రమానికి వస్తుంది. అక్కడ ఆడుకుంటున్న పిల్లని చూసి మురిసిపోతుంది. మురారి తనని వెతుక్కుంటూ ఆశ్రమానికి వస్తాడు. చెప్పకుండా అలా వచ్చేశావ్ ఏంటి ఎంత కంగారుపడ్డానో అంటాడు. ఇక్కడ ఒక పాపను దత్తత తీసుకుని పెద్దత్తయ్య చేతిలో పెడితే వారసురాలు వచ్చేసిందని పెద్దత్తయ్య చాలా సంతోషిస్తుందని కృష్ణ అంటుంది.

మురారిని మాట్లాడనివ్వకుండా ఒక పాపని లేదంటే ముగ్గురిని నలుగురిని తీసుకుని వెళ్లిపోదామని అంటుంది. కృష్ణ నీ ఆలోచన బాగుంది కానీ పిల్లలని ఎందుకు దత్తత తీసుకుంటున్నారని పెద్దమ్మ అడిగితే ఏం చెప్తావని అంటాడు. అవును కదా పిల్లల్ని చూసేసరికి అంతా మర్చిపోయాను ఎంత దురదృష్టవంతురాలిని అనుకుంటుంది.

సరోగసి మథర్ చూపించమన్న కృష్ణ

సరోగసి పూర్తయి మన బిడ్డ మన చేతికి వస్తే ఎంత బాగుంటుందో కదా అని మురారి నచ్చజెప్తాడు. వైదేహి సరోగసి ప్రాసెస్ కి సంబంధించి కృష్ణ వాళ్ళతో సంతకాలు తీసుకుంటుంది. సరోగసి మథర్ దొరికినందుకు కృష్ణ చాలా సంతోషపడుతుంది. ఆవిడని ఒక్కసారి చూపించమని కృష్ణ బతిమలాడుతుంది.

తనని చూపించమని ఎవరికీ చెప్పమని మురారి కూడా అడుగుతాడు. కానీ వైదేహి మాత్రం చెప్పేందుకు అంగీకరించదు. సరోగసి మథర్ ని చూడలేకపోతున్నందుకు కృష్ణ చాలా బాధపడుతుంది. నా ప్రాణాన్ని తీసుకెళ్ళి ఇంకొకరి గర్భంలో దాస్తున్నా తనని చూడకుండా ఎలా ఉండగలను ఈ తల్లి మనసు ఎలా ఊరుకుంటుందని కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

టెన్షన్ లో కృష్ణ

ఆవిడ ఎవరో తెలుసుకుని రెండు మూడు రోజుల్లో నీ ముందు నిలబెడతానని మురారి కృష్ణకి మాట ఇస్తాడు. దీంతో కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవుడి దయ వల్ల సరోగసి మథర్ దొరికింది కానీ ఆవిడని చూసి ఉంటే బాగుండేది. ఆవిడ మనసు మంచిదై ఆరోగ్యవంతమైన బిడ్డని ఇస్తే చాలని అనుకుంటుంది.

ఇంత చేసిన తర్వాత పెద్దత్తయ్య ఏమంటారో? అటు సరోగసి మథర్ ని ఇటు ఇంట్లో వాళ్ళని ఎలా మ్యానేజ్ చేయాలో తెలియడం లేదని కృష్ణ అనుకుంటుంది. మురారి పరిమళకి ఫోన్ చేసి సరోగసి మథర్ కోసం మరొక డాక్టర్ ని కలుస్తాడు. భార్య కోరిక తీర్చాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. ఇక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

తరువాయి భాగంలో..

మురారి కృష్ణతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ముకుంద వస్తుంది. ఇప్పుడు ఆవిడ ఎవరో తెలుసుకుని ఏం చేస్తారని ముకుంద అడుగుతుంది. మా బిడ్డని మోసే ఆవిడని ప్రాణంగా చూసుకుంటామని మురారి చెప్తాడు. నీ బిడ్డని మోయబోయే ఆ సరోగసి మథర్ ని నేనే అని ముకుంద మురారి తల మీద చెయ్యి పెట్టి మరీ చెప్తుంది.

 

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024