Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
చంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారు
కూటమిలో పార్ట్‌నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారు
ఏ బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుంది
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు
2014-2019 మధ్య అవినీతి జరిగింది
పోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీ, అమిత్ షాకు తెలుసు
పోలవరాన్ని సీఎం వైయస్ జగన్ పూర్తి చేసి చూపిస్తారు..ఆ శక్తి వైయస్ జగన్‌కు ఉంది
కేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తారు
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌మీడియం కావాలని 95 శాతం మంది కోరారు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ..భూమాఫియాకు ఊపిరాడకుండా చేస్తోంది
తాడేపల్లి: కూటమిలో పార్ట్‌నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ అగ్రనేత అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..
బీజేపీ అగ్ర నాయకుడు ఈ రోజు వైయస్‌స్ జగన్‌పై ఆరోపణలు చేశారు. అందులో పస లేదు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ఒక అవాస్తవమైన ఇమెజ్‌ను చూపాలని ప్రయత్నం చేసింది. మేం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఏవేదో జరిగిపోతుందని, ప్రపంచలోని చెడు అంతా ఇక్కడే ఉన్నట్లు చంద్రబాబు మొదలుపెట్టారు. ఈ రోజు అమిత్‌షా కూడా అవే వల్ల వేశారు. కూటమిలో పార్టనర్ కాబట్టి ఇక్కడికి వచ్చిన తరువాత విమర్శించాలి కాబట్టి విమర్శించారు. వాళ్లు అనుకుంటున్న అవకతవకలు ఉంటే ఎత్తి చూపవచ్చు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను అమిత్‌షా చదివారు. అవినీతిలో ప్రభుత్వం కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా సంక్షోభ సమయం తీసేస్తే మిగతా సమయంలో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆపలేదు. కరోనా సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం యాక్టివ్‌గా పని చేసింది. ఎక్కడ జరగని విధంగా నేరుగా రూ.2.70 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశాం. ఇందులో ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పంపించాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. నాడు-నేడు కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. వీటికి లెక్కలున్నాయి. మేం గర్వంగా చెబుతున్నాం..పారదర్శకంగా, అర్హులకు దళారులకు ప్రమేయం లేకుండా ఇచ్చాం. కొత్తగా టేకప్ చేసిన ప్రాజెక్టుల్లో కూడా పారదర్శకంగా చేపట్టాం. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఓ పొలిటికల్ లీడర్‌గా మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ ఇదీ వాస్తవమని చెప్పడం మా బాధ్యత.
2014-2019లో అవినీతి జరిగింది. ఆ ప్రభుత్వంలో బీజేపీ పార్టనర్. ఆ పాపం నుంచి ఎట్లా తప్పించుకుంటారు. మీ అవినీతిని సహించలేకే ప్రజలు 2019లో మీ కూటమిని తిరస్కరించారు. చంద్రబాబు అవినీతిని సహించలేక టీడీపీని తిరస్కరించారు. అలాంటి పార్టీతో ఇవాళ బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకుంది.
పోలవరం ప్రాజెక్టును వైయస్ జగన్ ప్రభుత్వం డిలే చేస్తుందని మాట్లాడుతున్నారు. 2019 న్నికల్లో మోదీ ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ఆ రోజు ప్రధాని విమర్శించారు. 2014 నుంచి 2017 వరకు ఈ ముగ్గురు పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు. ఆ రోజు చంద్రబాబు స్పెషల్ ప్యాకేజీ తెచ్చుకున్నారు. నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్‌ను కట్టబెట్టారు. 2015-2016 రేట్ల ప్రకారం చంద్రబాబు వారికి కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. అందులో అంతా అవినీతే జరిగింది. వర్క్ జరగకపోయినా అడ్వాన్స్ ఇచ్చారు. ఉన్న కాల్వనే వెడల్పు చేసి కాపర్ డ్యామ్‌ను తీసుకున్నారు. ఆ రోజు చంద్రబాబు తన ఆదాయం కోసం పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారు. స్పీల్ డ్యామ్ కట్టకుండా, నీటిని మళ్లించకుండ, కాఫర్ డ్యామ్‌ను క్లోజ్ చేయలేదు. నీళ్లు రావడంతో స్పీల్ చానల్ దెబ్బతినింది. ఈ విషయాలన్ని ప్రధానికి, అమిత్‌షాకు తెలుసు.
వైయస్ జగన్ వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి రూ.850 కోట్లు సేవ్ చేశారు. కేంద్రం సకాలంలో నిధులు ఇస్తే రెండేళ్లు అవసరం లేదు. ఏడాదిన్నరలోనే పోలవరాన్ని పూర్తి చేస్తారు. మార్చి 7వ తేదీ నాటికి రూ.12900కోట్లు మొదటి దశకు సంబంధించి కేబినెట్ నోట్ కూడా రెడీ అయ్యింది. ఆ తరువాత వీరి పొత్తు కుదిరింది. ఆ తరువాత మూడు కేబినెట్ మీటింగ్లు జరిగాయి. ఆ తరువాత నుంచి పోలవరం ఊసే లేదు. బ్యాంకు రుణాలు రాకుండా కూడా అడ్డుకున్నారు. రూ.200 రీయింబర్స్‌మెంట్ కూడా చేయడం లేదు.
పోలవరాన్ని సిన్సియర్‌గా పూర్తి చేయాలని వైయస్ జగన్ చిత్తశుద్ధితో ఉన్నారు. పూర్తి చేసేది కూడా ఆయనే అని జనాలు నమ్ముతున్నారు. ఇవాళ పొత్తు కుదిరింది కాబట్టి విమర్శిస్తున్నారు. ఇందులో లోపం, పాపం చంద్రబాబుదే. ఆయన ఒత్తిడికి గురవుతున్న బీజేపీదే.
తెలుగు భాషను వీరు ఉద్ధరించింది లేదు..మేం తగ్గించింది లేదు. అమిత్ షా, చంద్రబాబు, పవన్‌ల పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు. ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలి. 94 శాతం ఇంగ్లీష్ మీడియం కావాలని ప్రజలు కోరుకున్న తరువాతే వైయస్ జగన్ ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకువచ్చారు.
చంద్రబాబు, రామోజీ రావు వంటి వారు ల్యాండ్ టైటిలింగ్ యాప్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.