దాడులు, అల్లర్లకు బాబు, పురందేశ్వరి ధ్వంసరచనే కారణం

Best Web Hosting Provider In India 2024

వదిన-మరిదిల ధ్వంసరచన కుట్రలకు ఐఏఎస్, ఐపీఎస్‌లు బలి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల టార్గెట్‌గా టీడీపీ పెత్తందారుల దాడులు

వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని వెన్నుపోటు రాజకీయంలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు

బాబు ట్రాప్‌లో పడినందునే ఎన్నికల అధికారులు, పోలీసులు బలిపశువులయ్యారు

పోలీసులే పాత్రధారులుగా తాడిపత్రి, నరసరావుపేట ఘటనలు

అధికారంలోకి రాగానే తప్పు చేసిన‌ అధికారులపై తీవ్ర చర్యలుంటాయి

శాసనమండలి విప్ లేళ్ల‌ అప్పిరెడ్డి

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయ‌ని, ఇంకా జరుగుతూనే ఉన్నాయని, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే.. ఈ దాడుల వెనుక చంద్రబాబు, అతని వదిన పురందేశ్వరి ధ్వంసరచన కుట్రలే కనిపిస్తున్నాయ‌ని వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, శాస‌న‌మండ‌లి విప్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ రౌడీమూకలంతా రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సూత్రాల్ని పక్కనబెట్టి యథేచ్ఛగా బరితెగించి దాడులు దిగారని మండిప‌డ్డారు. వారు అంతగా రౌడీయిజం చలాయిస్తూ, వైయ‌స్‌ఆర్ సీపీ కేడర్‌ను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నా.. పోలీసుయంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నామ‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో లేళ్ల అప్పిరెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

లేళ్ల అప్పిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. 
చంద్రబాబు, పురందేశ్వరితో పాటు వారి తోకపార్టీలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకంలేదు. కనుకే, వారు వ్యవస్థలను అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పాకులాడుతున్నారు. ముఖ్యంగా పోలింగ్‌ కు  కొద్దిరోజుల ముందే,  పోలీసు అధికారులను బదిలీలు చేయించి.. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడ్నే తెలుగుదేశం మూకలు ప్రజాస్వామ్య విలువల్ని అపహాస్యం చేశారు. వైయ‌స్‌ఆర్‌సీపీ కేడర్‌ను అడుగడుగునా ఇబ్బందులకు గురిచేస్తూ.. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలికే విధంగా పోలీసు వ్యవస్థను వాడుకున్నారు. మేము పెట్టిన అభ్యంతరాలను పరిశీలించకుండానే.. తెలుగుదేశం రిప్రజెంటేషన్‌లపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ చర్యలు చేపట్టిన ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలిని కూడా ప్రజలు అంతా గమనించారు. దీన్నిబట్టి చంద్రబాబు, పురందేశ్వరి కలిసి అటు ఎన్నికల కమిషన్‌తోనూ, ఇటు పోలీసు యంత్రాంగంతోనూ ఎన్నికల ప్రక్రియను అడ్డగోలుగా జరుపుకోవాలని ప్రయత్నించారన్నది ఈసీ చర్యలతో రుజువైంది కూడా. 

గెలవలేమనే అధికారుల మార్పులు
ప్రజాస్వామ్య తీర్పు పట్ల ఏమాత్రం విశ్వాసం లేకుండా ఎన్నికల్లో అడ్డదారులు తొక్కడానికి చంద్రబాబు సిగ్గుపడాలి. రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నానని.. 14 ఏళ్లు పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. నీ బతుకంతా వెన్నుపోటు రాజకీయాలు, పొత్తుల బేరాలతో వ్యవస్థల్ని అడ్డంపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడమే కదా..? ప్రజాస్వామ్య విలువల పట్ల గౌరవం లేకపోతే ఎలా…? పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఎస్పీలను ఎందుకు మార్పించాల్సి వచ్చింది..?అంటే, మీకు కావాల్సిన నియోజవర్గాలను ముందుగానే ఎంచుకుని అక్కడ పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని లబ్ధిపొందాలనే కుట్రతోనే మార్చారు కదా..? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్తే గెలవలేమనే భయంతోనే ఇలా చేశారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల టార్గెట్‌గా దాడులు
వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నట్టు, పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధమే ఈ ఎన్నికలు అనే మాట నిజమైంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ రౌడీమూకలంతా గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలనే టార్గెట్‌ చేసుకుని మరీ దాడులు చేసి గాయపరుస్తున్నారు. అంటే, తమ అధికార పెత్తనానికి ఈ పేదవర్గాలు అడ్డమొస్తున్నారనే కసితో ఆయా వర్గాలను మీరు లక్ష్యంగా పెట్టుకున్నారనేది అందరికీ తెలిసిపోయింది. తమను అన్నివిధాలుగా ఆదుకున్న వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సపోర్టు చేయడమే వారి నేరమా..?, వారిని కంటికి రెప్పలా చూసుకున్న వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వమే మళ్ళీ రావాలని వారు కోరుకున్నారని టార్గెట్‌ చేసి దాడులు చేయడం భావ్యమేనా..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సంస్కృతి మీకు మంచిదికాదని హెచ్చరిస్తున్నాను. 

వారి కుట్రకు ఐఏఎస్, ఐపీఎస్‌లు బలి
రాజకీయ లబ్ధి కోసమే అడ్డదారులు తొక్కి, వ్యవస్థల్ని వాడుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఆక్రమంలోనే ఎన్నికలకు ముందే తమకు నచ్చిన ప్రాంతాల్లోని సిన్సియర్‌ అధికారులను పక్కకు తప్పించి.. తనకు నచ్చిన అధికారులను నియమించుకున్నారు. నిన్న ఎన్నికల కమిషన్‌ ముగ్గురు అధికారుల మీద సీరియస్‌ యాక్షన్‌ తీసుకుని.. ఇద్దరిని సస్పెండ్‌ చేసి, ఒకరిని బదిలీ చేసిందంటే.. మా అనుమానాలు నిజమయ్యాయి. కూటమి రాజకీయ కుట్ర మేరకే ఆయా అధికారులు పనిచేశారని చెప్పేందుకు ఇంతకన్నా పెద్ద ఉదాహరణలేముంటాయి..? చంద్రబాబు వంటి నీచపు రాజకీయ నేతల వలన బలైన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల్లోనూ ఆలోచన రావాలి. తాము ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశారో.. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఇద్దరు ఐపీఎస్‌లు సస్పెండ్‌ కావడం, మరో ఐపీఎస్‌ను బదిలీతో పాటు అతని పనితీరుపై శాఖాపరమైన దర్యాప్తుకు సిట్‌ను నియమించిన తీరును చూస్తున్నాం. ఈ ఘటనలతో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ అధికారుల్లో కూడా కొంత ఆలోచన మార్పు రావాలని కోరుతున్నాం. చంద్రబాబు, పురందేశ్వరి ట్రాప్‌లో పడితే మీ జీవితాలను మీరే నల్లటి సిరాతో రాసుకోవాల్సి వస్తుంది. 

పోలీసులే పాత్రధారులుగా..
తాడిపత్రిలో జరిగిన సంఘటనలు మరీ ఎంత భయంకరంగా ఉన్నాయంటే.. అవి మాటల్లో చెప్పనలవికానివి. ఎవరైనా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారు..? ఎప్పుడైనా, జరగరానిదేదైనా జరిగినప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పోలీసులకు సాక్ష్యంగా ఉంటాయనే కదా పెట్టుకునేది…? అలాంటి సీసీ కెమెరాలు పెట్టుకున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు ఏం చేశారో ప్రజలంతా కళ్ళారా చూశారు. శాంతిభద్రతలు రక్షించాల్సిన పోలీసులే పాత్రధారులుగా ఎమ్మెల్యే ఇంటిలో విధ్వంసం సృష్టిస్తారా..? మరలా మీడియా ద్వారా, ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం (తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసంలో సీసీ కెమెరాలను ధ్వంసంచేస్తున్న పోలీసుల తీరును వీడియోక్లిప్‌ ద్వారా మీడియా ముందు ప్రదర్శించారు)
     – సాక్షాత్తూ తాడిపత్రి శాసనసభ్యుడు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీ కెమెరాలనే పోలీసులు ధ్వంసం చేయడం, అవి రికార్డు చేసిన పరికరాలను సైతం స్వాధీనం చేసుకుని వారు దౌర్జన్యాలకు ఒడిగట్టారు. అంటే, ఈ వ్యవస్థను ఏ దిశగా మీరు తీసుకెళ్తున్నారో చెప్పండి..? 
– నరసరావుపేట సీనియర్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన, ఆయన నివాసంపైన తెలుగుదేశం మూకలు పట్టపగలు దాడిచేసి.. ఇంటిపైకి రాళ్లు విసిరి.. కర్రలతో కార్లు ధ్వంసం చేసి.. ఇంటిపైకెళ్లి ఎమ్మెల్యే మామని తీవ్రంగా గాయపరిచిన ఘటనకు సంబంధించిన మరో వీడియోను కూడా మీడియాకు ప్రదర్శించారు. 

దీపక్‌మిశ్రా కనుసన్నల్లోనే దాడులు
ఎన్నికలకు సంబంధించి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగరాదని.. స్థానిక పోలీసుయంత్రాంగంపైన మానిటరింగ్‌కు కేంద్రం నుంచి ఎన్నికల సంఘం పంపిన పోలీసు అబ్జర్వర్‌ దీపక్‌మిశ్రా ఏం చేశాడు..? ఎన్నికల సమయంలో ఆయన ఎక్కడ ఉన్నాడు..? జరిగిన దాడుల పర్వాన్ని చూస్తుంటే.. పోలీసు అధికారులు వ్యవహరించిన తీరును పరిశీలిస్తే ఇదంతా దీపక్‌మిశ్రా కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానాలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఎన్నికల సంఘానికి, గవర్నర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాం. 

సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశానుసారం సంయమనం పాటించాం
వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆదినుంచి వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. మా నాయకుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. ఆయన ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను చాలా ప్రశాంతంగా నడిపి రాజ్యాంగ సూత్రాల ప్రకారం ప్రజాతీర్పుతోనే మేము అధికారంలోకి రావాలని భావించాం. మా నాయకుడు వైయ‌స్ జగన్‌ కూడా ఎన్నికల అధికారులు, పోలీసు యంత్రాంగం పట్ల అచెంచల విశ్వాసాన్ని కనబరిచారు. చంద్రబాబు, పురంధేశ్వరి, ఇతర తోకపార్టీల నేతలు ఎన్ని కుట్రలు చేసి.. ఎంత కవ్వించినా వైయ‌స్‌ఆర్‌సీపీ కేడర్‌ మాత్రం ఆవేశకావేశాలకు గురికాకుండా ఎంతగానో సంయమనం పాటించారు. 

మేం అధికారంలోకి రాగానే చర్యలుంటాయి 
ఇప్పటికైనా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేయాలని కోరుతున్నాం. రేపు జూన్‌ 4న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బ్రహ్మండమైన మెజార్టీతో గెలవబోతూ ఉంది. మేము అధికారంలోకి రాగానే ఎవరైతే అడ్డదారిలో నడిచారో, విలువల్ని తుంగలో తొక్కి చంద్రబాబు ట్రాప్‌లో పడి, ఆయన కోసం పనిచేశారో.. వారందరినీ లెక్కగట్టి శాఖపరమైన విచారణకు పిలిపిస్తాం. ఆధారాలతో సహా రుజువు చేసి వారిపై చర్యలు తీవ్రంగా తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. 

సువర్ణాక్షరాలతో లిఖించే ఎన్నికల ఫలితాలతో వైయ‌స్‌ జగనే సీఎం
మా అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్టు 2019 ఎన్నికల ఫలితాల కంటే 51 శాతానికి మించి ఓట్లను పొందామన్నది వాస్తవం. ఈ విషయం జూన్‌ 4 ఫలితాల్లో పాజిటివ్‌ ఓటింగ్‌ సునామీని మనమంతా చూడబోతున్నాం. వైయ‌స్‌ జగన్‌ నోటివెంట ఆ విషయాన్ని విన్న దగ్గర్నుంచి తెలుగుదేశం అండ్‌ కో కూటమి వర్గాల్లో కుతకుత మొదలైంది. కరోనాలాంటి కల్లోలం ఈ రాష్ట్రాన్ని రెండేళ్లపాటు పీడించినప్పటికీ, దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు సంబంధించిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందించిన ఘనత వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వానికే దక్కింది. కాబట్టే.. ఆయన మీ ఇంట్లో మంచి జరిగేతేనే మరోమారు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని రిక్వెస్ట్‌ చేశారు. ఆ ప్రభావమే రేపటి ఎన్నికల ఫలితాల్లో కనిపించనున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫలితాల ప్రభంజనంతో ఏపీ ముఖ్యమంత్రిగా వైయ‌స్ జగన్‌ రోల్‌మోడల్‌గా నిలవనున్నారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయం జూన్ 4న వైయ‌స్ఆర్ సీపీకి దక్కబోతుంది.. అని అప్పిరెడ్డి అన్నారు.

Best Web Hosting Provider In India 2024