Krithi Shetty Sharwanand: హీరో శర్వానంద్‌పై కృతి శెట్టి కామెంట్స్.. అలా ఫినిష్ చేశాడంటూ!

Best Web Hosting Provider In India 2024

Krithi Shetty About Sharwanand: డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ (Manamey Movie) తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్‌ని అందించడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో ఉప్పెన బేబమ్మ, బ్యూటిఫుల్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ‘మనమే’ సినిమా జూన్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కృతి శెట్టి మూవీ విశేషాలని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

శర్వానంద్ గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?

శర్వానంద్ గారు వన్ అఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మర్. నిన్న సినిమా చూశాను. ఆయన ప్రతి సీన్‌లో అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. ఆయన ఎక్స్‌పీరియన్స్ కనిపించింది. ఇందులో నాకు ఓ ఫేవరట్ సీన్ ఉంది. ఆ సీన్ కోసం చాలా వెయిట్ చేశాను. ఎలా చేయాలో అని చాలా అలోచించాను. కానీ, శర్వానంద్ గారు చాలా కాజ్యువల్‌గా వచ్చి ఆ సీన్‌ని ఒక్క నిమిషంలో అద్భుతంగా ఫినిష్ చేశారు. నేను స్టన్ అయిపోయాను.

శర్వానంద్ గారి పెర్ఫార్మెన్స్‌ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. అందులో ఒక బేబీ కూడా ఉంది. బేబీతో షూట్ చేయడం అంత ఈజీ కాదు. అయితే శర్వానంద్ గారు చాలా బ్యూటీఫుల్‌గా హ్యాండిల్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు.

ఈ సినిమా మేజర్ పార్ట్ ఎబ్రాడ్‌లో షూట్ చేయడం ఎలా అనిపించింది?

లండన్‌లో షూట్ చేశాం. లండన్ వెదర్ చాలా అన్‌ప్రెడిక్టిబుల్‌గా ఉంటుంది. మేము షూట్ చేసిన హౌజ్‌లో చాలా విండోస్ ఉంటాయి. ఒక ఫ్రేం సెట్ చేశాక లైట్ మారిపోతుంది. సడన్‌గా వర్షం పడుతుంది. మళ్లీ లైట్ వచ్చేవరకూ వెయిట్ చేయాలి. ఇది చాలా డిఫికల్ట్ ప్రాసెస్.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది ?

చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. లండన్‌లో ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకున్నారు. విశ్వప్రసాద్ గారు చాలా స్వీట్.

సక్సెస్ ఫెయిల్యూర్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ?

సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండదు. మన చేతిలో లేని విషయాలు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను.

మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనీ ఉంటుంది?

నాకు ప్రిన్సెస్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. బాహుబలిలో (Baahubali Movie) అనుష్క (Anushka) గారి లాంటి క్యారెక్టర్స్. అలాగే యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న రోల్స్ చేయాలని ఉంది.

అప్ కమింగ్ ఫిల్మ్స్ ?

మూడు తమిళ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. అలాగే టోవినో థామస్‌తో (Tovino Thomas) ఒక మలయాళం ఫిల్మ్ చేస్తున్నాను.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024