Best Web Hosting Provider In India 2024
Manamey: శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాపై ఆసక్తి చాలా ఉంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. రిలేషన్‍షిప్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. శర్వా సరసన కృతి శెట్టి హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రం జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీమ్ రెడీ అయింది. ఈ ఈవెంట్ డేట్, వేదికను ప్రకటించింది.
ఈవెంట్ వివరాలివే..
మనమే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు (జూన్ 5) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‍లోని పార్క్ హయాత్ హోటల్‍లో జరగనుంది. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేడు అధికారికంగా ప్రకటించింది.
శర్వా, కృతి ఉన్న ఓ కలర్ ఫుల్ పోస్టర్‌తో మనమే ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలను మూవీ టీమ్ వెల్లడించింది. “మనమే ప్రీ-రిలీజ్ సెలెబ్రేషన్లకు రెడీ అవండి. జూన్ 5 సాయంత్రం 6 నుంచి పార్క్ హయాత్‍లో జరుగుతుంది” అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది.
రామ్‍చరణ్ హాజరుకారా?
శర్వానంద్‍కు క్లోజ్ ఫ్రెండ్ అయిన గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్.. మనమే ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు వస్తారని కొంతకాలంగా రూమర్లు వచ్చాయి. పిఠాపురంలో ఈ ఈవెంట్ ఉంటుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే, హైదారాబాద్‍లోనే ఈవెంట్ నిర్వహించేందుకు మూవీ టీమ్ రెడీ అయింది. ఈ ఈవెంట్‍కు రామ్‍చరణ్ హాజరు కావడం లేదని తెలుస్తోంది.
మాస్ మహారాజ్ వచ్చే ఛాన్స్
మనమే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మాస్ మహారాజ్ రవితేజ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. అయితే, ఈ విషయాన్ని మూవీ టీమ్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
మనమే సినిమాలో శర్వానంద్, కృతి శెట్టితో పాటు బాలనటుడు శ్రీరామ్ ఆదిత్యది కూడా ప్రధాన పాత్రే. వీరి ముగ్గురి చుట్టే ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ చిత్రంలో సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సుదర్శన్ కీరోల్స్ చేశారు.
మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా పెద్దబలంగా కనిపిస్తోంది. ఈ మూవీలో బిట్ సాంగ్స్ కలుపుకొని మొత్తంగా 16 పాటలు ఉంటాయని దర్శకుడు ఆదిత్య హింట్ కూడా ఇచ్చారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
మనమే సినిమా విజయంపై శర్వానంద్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా కథ కొత్తగా డిఫరెంట్‍గా ఉంటుందని తాను చెప్పడం లేదని, కానీ అందరికీ మంచి ఫీల్ ఇస్తుందని శర్వా చెప్పారు. చాలా మంచి సినిమా చూశామని ప్రేక్షకులు భావిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ మూవీ బాగా రావాలని చాలాసార్లు గొడవలు పడ్డామని కూడా తెలిపారు. ఈ చిత్రం ఫలితాన్ని తాను బాధ్యతగా తీసుకుంటానని కూడా శర్వానంద్ అన్నారు.