Horror Movie: రూ.6 కోట్ల బడ్జెట్.. ఒకే ఇంట్లో షూటింగ్.. బ్లాక్‌బస్టర్ అయిన ఈ హారర్ మూవీ తెలుసా?

Best Web Hosting Provider In India 2024

Horror Movie: సినిమాల్లో హారర్ జానర్ కు ఓ ప్రత్యేకత ఉంది. తక్కువ బడ్జెట్ తో పెద్దగా లొకేషన్లు అవసరం లేకుండా సులువుగా తీయొచ్చు. థియేటర్లలో కాస్త భయటపెట్టగలిగితే చాలు పెట్టిన బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. రెండు దశాబ్దాల కిందట వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ హారర్ జానర్లోని బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తోంది.

ఆర్జీవీ భూత్

రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పేరు భూత్ (Bhoot). కామెడీ, క్రైమ్, సస్పెన్స్ ఇలా అన్ని జానర్ల సినిమాల్లోనూ తన సత్తా చాటిన ఆర్జీవీ.. భూత్ ద్వారా హారర్ జానర్ మూవీ కూడా అదిరిపోయేలా తీయగలనని నిరూపించాడు. 2003లో రిలీజైన ఈ సినిమాను రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రూ.21.9 కోట్లు వసూలు చేయడం విశేషం.

అప్పటికే శివ, అనగనగా ఒకరోజు, రంగీలా, సత్యలాంటి డిఫరెంట్ జానర్ల సినిమాలను తనదైన స్టైల్లో తీసిన ఆర్జీవీ.. ఈ హారర్ జానర్ సినిమాను కూడా కొత్త పంథాలో తెరకెక్కించాడు. అంతకుముందే రాత్రి సినిమా ద్వారా ప్రేక్షకులను భయపెట్టిన వర్మ.. ఈ భూత్ ద్వారా ఆ హారర్ జానర్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లాడు. అజయ్ దేవగన్, ఊర్మిళ ఈ భూత్ సినిమాలో నటించారు.

భూత్ స్టోరీ ఇది

చాలా హారర్ సినిమాల స్టోరీల్లాగే ఈ భూత్ స్టోరీ కూడా ఉందని చెప్పొచ్చు. ఓ జంట కొత్త ఇంట్లోకి వెళ్లడం, అప్పటికే ఆ ఇంట్లో ఉండి చనిపోయిన ఓ అమ్మాయి ఆత్మ ఆమెలోకి వెళ్లడం ఇలా సాగిపోతుంది సినిమా. భూత్ మ్యూజిక్ నుంచి ఏడు పాటలు ఉన్నట్లు ముందు చెప్పారు. కానీ సినిమాలో మాత్రం ఒక్క పాట కూడా లేదు. ఎండ్ క్రెడిట్స్ లో మాత్రం ఒక పాట వస్తుంది.

ఈ భూత్ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోనే భయపెట్టిందని చెప్పొచ్చు. వర్మ స్టైల్ మేకింగ్ థియేటర్లలో ప్రేక్షకులను భయంతో వణికేలా చేసింది. మూవీ చాలా వరకు ఒక ఇంట్లోనే తీయడం విశేషం. మామూలుగా తన సినిమాలను తక్కువ బడ్జెట్ తో ముగించే వర్మ.. ఈ భూత్ ను కూడా అలాగే తీశాడు. సక్సెస్ సాధించాడు. బడ్జెట్ కంటే మూడున్నర రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది.

భూత్ సూపర్ హిట్

ఈ భూత్ మూవీని మనోజ్ బాజ్‌పాయీ, అభిషేక్ బచ్చన్ లాంటి వాళ్లు మిస్ చేసుకున్నారు. చివరికి ఇది అజయ్ దేవగన్ చేతికి వెళ్లింది. అతని కెరీర్లో ఓ మంచి హిట్ గా నిలిచిపోయింది. భూత్ సినిమాను తర్వాత 12 భాషల్లో డబ్ చేయడం విశేషం. తెలుగులోనూ 12వ అంతస్తు పేరుతో రిలీజ్ చేశారు. తమిళంలో షాక్ పేరుతో రీమేక్ చేశారు.

హారర్ జానర్ మూవీని సరికొత్తగా అందించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది భూత్ మూవీ. ఈ సినిమాలో తన నటనకుగాను ఊర్మిళ బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీలో ఫిల్మ్ ఫేర్, స్టార్ స్క్రీన్, జీ సినీ అవార్డులు అందుకుంది. దీనికి 2012లో భూత్ రిటర్న్ పేరుతో ఆర్జీవీనే సీక్వెల్ తీసినా.. అది అస్సలు ఆకట్టుకోలేకపోయింది. ఓ డిజాస్టర్ గా మిగిలిపోయింది.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024