Best Web Hosting Provider In India 2024
Traffic Diversions: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఐటీ టవర్స్ సమీపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో కృష్ణా జిల్లా పరిధిలో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు.
జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు హాజరు కానున్నారు.
ఈ సందర్బంగా, వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా, రవాణాకు అంతరాయం ఏర్పడకుండా, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను జిల్లా పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు నిర్ణయించుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు…
విశాఖ పట్నం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలను
1 .కత్తిపూడి నుండి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తరు.
2 . విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లి వచ్చే వాహనాలను కత్తిపూడి నుండి ఒంగోలు వైపు మళ్లిస్తారు.
చెన్నై నుండి విశాఖపట్నం వైపు వచ్చు వాహనాలు
1 .ఒంగోలు నుండి రేపల్లె మీదుగా వయ మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నరసాపురం – అమలాపురం – కాకినాడ – కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు.
2 . బుడంపాడు నుండి తెనాలి – పులిగడ్డ – మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నర్సాపురం – కాకినాడ – కత్తిపూడి వైపు మళ్లిస్తారు.
విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను
1 . గామన్ బ్రిడ్జి – దేవరపల్లి – జంగారెడ్డిగూడెం – అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ మళ్లిస్తారు.
2 . భీమడోలు – ద్వారకాతిరుమల – కామవరపుకోట – చింతలపూడి నుండి ఖమ్మం వైపు మళ్లిస్తారు.
3 . ఏలూరు బైపాస్ నుండి – జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు.
4 . ఏలూరు బైపాస్ – చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా.
5 . హనుమాన్ జంక్షన్ – నూజివీడు, మైలవరం – ఇబ్రహీంపట్నం – నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వచ్చే వాహనాలను
1 . నందిగామ – మధిర – వైరా – సత్తుపల్లి – అశ్వరావుపేట – జంగారెడ్డిగూడెం – దేవరపల్లి – గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు పంపుతారు.
2 . ఇబ్రహీంపట్నం – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు.
3 . రామవరప్పాడు – నున్న – పాముల కాలువ – వెలగలేరు – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ – ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లిస్తారు.
4 . విజయవాడ నుండి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు – తాడిగడప – కంకిపాడు – పామర్రు – గుడివాడ నుండి భీమవరం వైపు పంపుతారు.
బుధవారం అమలులో ఉండే ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు రూపొందించుకోవాలని, గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో ప్రమాణ స్వీకారం జరుగుతున్నందున విమాన ప్రయాణికులు వీలైనంత ముందుగా ఎయిర్ పోర్ట్ చేరుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. వివిఐపిల రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయలు ఉంటాయని వీటిని పరిగణలోకి తీసుకోవాలని పోలీసులు సూచించారు.
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్