Sarkaar Episode 9 Promo: సుధీర్ కష్టం పగవాడికి కూడా రాకూడదంట.. ఎందుకో చూడండి.. సర్కార్ కొత్త ప్రోమో

Best Web Hosting Provider In India 2024


Sarkaar Episode 9 Promo: సుడిగాలి సుధీర్ ఉన్నాడంటే అది ఏ షో అయినా సూపర్ హిట్టే. కొన్నేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ షో కూడా సుధీర్ రాక తర్వాతే ఆ ఓటీటీలో టాప్ షోగా మారింది. ప్రతి శుక్రవారం ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ వస్తుంది. తాజాగా రాబోయే శుక్రవారం (జూన్ 14) వచ్చే 9వ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

సర్కార్ 9వ ఎపిసోడ్ ప్రోమో

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సర్కార్ షో 9వ ఎపిసోడ్ ప్రోమోను సోమవారం (జూన్ 10) రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కు సోనియా, సిద్ధు.. సిరి హనుమంతు, శ్రీహాన్ జంటలు వచ్చాయి. సుధీర్ ఈ నలుగురితో కలిసి ఆడుకోవడం, ఆ నలుగురూ సుధీర్ తో ఆడుకోవడం.. ఇలా నాలుగున్నర నిమిషాల ప్రోమో సరదాగా సాగిపోయింది. సుధీర్ తనదైన స్టైల్లో కామెడీ పండించాడు.

నా కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ ఇందులో తనమీద తానే జోకులు కూడా వేసుకున్నాడతడు. ఇక ఈ రెండు జంటలూ అతనితో ఆడుకున్నాయి. వాళ్లు అతనిపై వేసిన పంచ్ లు నవ్వు తెప్పించాయి. ఈ మధ్యే ఎందుకు నీకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని శ్రీహాన్ అడిగితే.. సరసమైన ధరలకు అని చూసి షాపులోకి వెళ్తే అక్కడ ధరలు ఉన్నాయి కానీ సరసం లేదంటూ సుధీర్ చెప్పడం విశేషం.

సర్కార్ గేమ్ షోలో ఇప్పటికే 8 ఎపిసోడ్లు ముగియగా.. ఈ 9వ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం (జూన్ 14) రాత్రి 8 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త ఎపిసోడ్లో ఆ రెండు జంటలతో కలిసి సుధీర్ చేసే అల్లరి మామూలుగా ఉండబోవడం లేదని ప్రోమో చూస్తే తెలుస్తోంది. మరి అసలు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

సర్కార్ సీజన్ 4

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కార్ గేమ్ షో మూడు సీజన్లు ముగిశాయి. అయితే వాటికి ప్రముఖ యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఉండగా.. నాలుగో సీజన్లో సుడిగాలి సుధీర్ వచ్చాడు. అతడు వచ్చినప్పటి నుంచీ ఈ కొత్త సీజన్ దూసుకెళ్తోంది. ఆహాలోని టాప్ ట్రెండింగ్ షోలలో నంబర్ వన్ గా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈ గేమ్ షో టాప్ లోనే ఉండటం విశేషం. తొలి ఎపిసోడ్లోనే డైరెక్టర్ తరుణ్ భాస్కర్, రాహుల్ రామకృష్ణలాంటి వాళ్లతో హిట్ అయింది.

తర్వాత రెండో ఎపిసోడ్లో ప్రసన్నవదనం మూవీ టీమ్ సుహాస్, రాశీ సింగ్ లాంటి వాళ్లు వచ్చారు. మూడో ఎపిసోడ్లో నలుగురు తెలుగు అమ్మాయిలతో సుధీర్ చేసిన అల్లరి మామూలుగా లేదు. ఐదో ఎపిసోడ్ కు సత్యభామ మూవీ టీమ్ నుంచి కాజల్, నవీన్ చంద్ర వచ్చారు. 7వ ఎపిసోడ్లో గం గం గణేశా టీమ్ రాగా.. గత శుక్రవారం (జూన్ 7) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్లో హీరో శివాజీ, నయని పావని వచ్చారు.

టీ20 వరల్డ్ కప్ 2024

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024