Best Web Hosting Provider In India 2024

Biggest Flop Movie: కొన్ని సినిమాలు ప్రొడ్యూసర్లపై కాసులు వర్షం కురిపిస్తే మరికొన్ని సినిమాలు వాళ్లను అప్పుల పాలు చేస్తాయి. ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. ఒకప్పుడు స్టార్ హీరో గోవిందాతో కలిసి కూలి నంబర్ 1, హీరో నంబర్ 1, బడే మియా చోటే మియాలాంటి సినిమాలు తీసిన వశు భగ్నానీ.. ఇప్పుడు అప్పుల పాలై తన ఆఫీస్ అమ్ముకోవాల్సి వచ్చింది.
నిర్మాతను అప్పుల పాలు చేసిన మూవీ ఇదే
ఇండియాలో ఎన్నో అతిపెద్ద ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఏడాది వచ్చిన బడే మియా చోటే మియా మూవీ. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోలు నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ఈ ఒక్క సినిమా వల్లే నిర్మాత వశు భగ్నానీ ఏకంగా రూ.250 కోట్లు నష్టపోయాడట. దీనికి తోడు అతని బ్యానర్ నుంచి ఈ మధ్య వచ్చిన ఏ సినిమా సక్సెస్ కాలేదు.
అంతకుముందు గణ్‌పత్, బెల్ బాటమ్ లాంటి మూవీస్ కూడా అట్లర్ ఫ్లాపయ్యాయి. దీంతో వశు భగ్నానీ అప్పులు ఊబిలో కూరుకుపోయాడు. ఒక్క బడే మియా చోటే మియా మూవీ వల్ల వచ్చిన రూ.250 కోట్ల నష్టాలను పూడ్చుకోవడానికి అతడు ముంబైలో ఉన్న తన ఏడంతస్తుల ఆఫీస్ ను అమ్మేశాడు. ఈ మూవీలో పని చేసిన చాలా మందికి అసలు జీతాలే ఇవ్వలేదట.
బోల్తా కొట్టిన బడే మియా చోటే మియా
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోలు నటించిన బడే మియా చోటే మియా మూవీ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. అతడు గతంలో ఎన్నో హిట్స్ అందించిన డైరెక్టరే. కానీ ఓ రొటీన్ యాక్షన్ మూవీ తీసి నిర్మాత కొంప ముంచాడు. ఈ సినిమాను ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. చివరికి బాక్సాఫీస్ దగ్గర వచ్చింది కేవలం రూ.90 కోట్లు మాత్రమే.
పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వశు భగ్నానీ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా వల్ల అతడు రూ.250 కోట్లు నష్టపోయాడు. అంతకుముందు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అతని కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. తన ఆఫీస్ అమ్మేయడంతోపాటు తన దగ్గర పనిచేసే 80 శాతం సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడం గమనార్హం.
ఇప్పుడీ బడా నిర్మాణ సంస్థ ఓ చిన్న టూ బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లోకి షిఫ్ట్ అవుతోందట. బమే మియా చోటే మియా మూవీలో నటించిన అక్షయ్, టైగర్, మానుషి, అలయా ఎఫ్ లాంటి స్టార్ నటీనటులకు కూడా వాళ్ల పూర్తి రెమ్యునరేషన్ అందలేదని సమాచారం. అయితే ఇప్పటి వరకూ దీనిపై వాళ్ల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఇలా ఒక్క సినిమాతో ఓ పెద్ద నిర్మాణ సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోవడం షాక్ కు గురి చేసేదే.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits