Karthika deepam 2 serial: కార్తీక్ కోసం తల్లడిల్లిపోతున్న శౌర్య.. పెళ్లి ముహూర్తాలు పెట్టించబోతున్న సుమిత్ర

Best Web Hosting Provider In India 2024

Karthika deepam 2 serial today july 9th episode: కార్తీక్ ఇంటికి వెళ్దామని శౌర్య అంటుంది. దీప చిరాకుగా ఎందుకు కార్తీక్ కార్తీక్ అంటున్నావ్ అని అడుగుతుంది. మరి అయితే కార్తీక్ మన ఇంటికి వస్తాడా అని శౌర్య అమాయకంగా అడుగుతుంది. శౌర్య కార్తీక్ తో పెంచుకున్న అనుబంధం చూసి దీప భయపడుతుంది.

 

కార్తీక్ ఇంటికి జ్యోత్స్న

కాంచన ఇంటికి జ్యోత్స్న వస్తుంది. కాఫీ టీ ఏం కావాలని శ్రీధర్ అడిగితే బావ కావాలి అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తే వచ్చాడు తీసుకో అంటాడు. దీప కనిపించిందా అని జ్యోత్స్న డైరెక్ట్ గా కార్తీక్ ని అడుగుతుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా దీప వెళ్లిపోయిందని జ్యోత్స్న కాంచన వాళ్ళకు చెప్తుంది.

ఎక్కడ నుంచి వస్తున్నావని అడిగితే హాస్పిటల్ నుంచి అని చెప్తాడు. శౌర్యకు బాగోకపోతే హాస్పిటల్ లో జాయిన్ చేసింది. శౌర్య కోసం దీప ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాను చాలా సేపు హాస్పిటల్ లో ఉన్నాను. పొద్దున్నే మావయ్య ఫోన్ చేసి దీప కనిపించడం లేదంటే హాస్పిటల్ కి వెళ్ళాను. దీప ఇంట్లో నుంచే కాదు హాస్పిటల్ నుంచి కూడా వెళ్లిపోయిందని చెప్తాడు.

ఎవరికి తెలియకపోయింద దీప గురించి నీకు తెలియాలి కదా. శౌర్య నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా. రాత్రి నువ్వు శౌర్య దగ్గర ఉన్నావ్ కదా తను ఏం చెప్పలేదా? దీప ఎందుకు వెళ్లిపోయిందో నీకు తెలుసా? అని జ్యోత్స్న కావాలని అడుగుతుంది. తను ఎందుకు వెళ్లిపోయిందో నాకేం తెలుసని బదులిస్తాడు.

 

కార్తీక్ నాకోసం ఎందుకు రాలేదు

దీప గురించి ఏమైనా తెలిస్తే చెప్పమని చెప్తుంది. మా ఇంట్లో మనిషి కనిపించకపోతే నిన్ను ఎందుకు అడుగుతున్నాను అంటే తన బాధ్యత నువ్వే తీసుకున్నావ్. అందుకే అడుగుతున్నాను. తన ఆచూకీ తెలిస్తే చెప్పు. ఇంటికి వెళ్ళి నీకు కూడా ఏమి తెలియదని చెప్తానని వెళ్ళిపోతుంది.

దీప ఇలా చేయడం తనకు నచ్చలేదని శ్రీధర్ అంటాడు. చెప్పుకోలేని కష్టాలు తనకు ఏం ఉన్నాయోనని కార్తీక్ బాధగా అంటాడు. దీప చాలా మంచిది ఎక్కడికి వెళ్లిందో ఎన్ని ఇబ్బందులు పడుతుందోనని కాంచన బాధపడుతుంది. శౌర్య కార్తీక్ నువ్వు నాకోసం రావాలి కదా ఎందుకు రాలేదని అంటుంది.

ఆ మాట విని దీప కంగారుగా వెళ్తుంది. శౌర్య గోడ మీద కార్తీక్ పేరు రాసి మాట్లాడుకుంటుంది. నువ్వు నా ఫ్రెండ్ కదా. వదిలేసి వెళ్లిపోతావా? నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. నువ్వు అంటే కూడా చాలా ఇష్టం. నువ్వు నా దగ్గరకు రావా? అంటూ కార్తీక్ చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటుంది.

భయపడుతున్న దీప

దీప చాలా బాధగా ఇలా రాయకూడదని కార్తీక్ పేరు తుడిపేస్తుంటే వద్దని అంటుంది. తనని ఎటు రానివ్వవు కనీసం పేరు అయిన ఉండనివ్వు అంటుంది. కార్తీక్ మాట్లాడిన మాటలు విన్నది ఏమోనని దీప చాలా కంగారుపడుతుంది. నేను హాస్పిటల్ లో లోపల పడుకున్నప్పుడు నువ్వు బయట కార్తీక్ ని ఎందుకు కోప్పడుతున్నావని దీపను నిలదీస్తుంది.

 

అక్కడ నువ్వు ఏమైనా విన్నావా అంటే విన్నాను నువ్వు కార్తీక్ కోప్పడుతున్నావని విన్నానని చెప్తుంది. మనం ఇక్కడ ఉన్నట్టు నాన్నకు తెలుస్తుందా అని శౌర్య అడుగుతుంది. తెలియదు అంటే అయితే నాన్నకు తెలియదు అంటే కార్తీక్ కి ఇంకెవరికీ తెలియదని శౌర్య అంటుంది.

జ్యోత్స్న ఇంటికి రాగానే దీప గురించి ఏమైనా తెలిసిందా అని పారిజాతం ఆత్రంగా అడుగుతుంది. తెలియదని చెప్తుంది. శివనారాయణ వాళ్ళు దీప గురించి మాట్లాడుకుంటారు. దీపను ఏమైనా అన్నావా అని సుమిత్ర జ్యోత్స్నని అడుగుతుంది. పారిజాతం నోటికి పని చెప్తుంది.

పెళ్లి ముహూర్తాలు పెట్టించబోతున్న సుమిత్ర

దీప రావాలని అనుకుంటే తిరిగి వస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన ఇంటి బిడ్డ గురించి. మనం వెళ్ళి కాంచనతో పెళ్లి గురించి మాట్లాడాము. కొడుకుతో మాట్లాడి చెప్తానని కాంచన చెప్పింది. కానీ ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదు. పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవడం మంచిదని అంటుంది.

పారిజాతం చెప్పింది కరెక్ట్ అని శివనారాయణ అంటాడు. ఈరోజే వెళ్ళి ముహూర్తాల గురించి మాట్లాడి రమ్మని శివనారాయణ కొడుకు, కోడలికి చెప్పి కాంచన వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. పారిజాతం, జ్యోత్స్న దీప కోసం రోడ్డు మీద పడి వెతుకుతూ ఉంటారు. దీప కోసం వెతకాల్సి వస్తుందని జ్యోత్స్న చిరాకుపడుతుంది.

 

కార్తీక్ బాబు మీరు అన్న ఒక్క మాట నా జీవితాన్నే మార్చేసింది. దీని గురించి ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక పారిపోయి వచ్చేశానని బాధపడుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

 

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024