Kamal Haasan: సిద్ధార్థ్, నేను ఏకలవ్య శిష్యులం.. అతనిలాంటి వారు ఇంకా రావాలి.. కమల్ హాసన్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Kamal Haasan About Siddharth Bharateeyudu 2: యూనివ‌ర్స‌ల్ స్టార్ కమల్ హాసన్ నటించిన మరో క్రేజీ సినిమా భారతీయుడు 2. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెరకెక్కించిన ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించారు.

అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెరకెక్కిన భార‌తీయుడు 2 ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ఇక ఈ మూవీ విశేషాలను పంచుకునేందుకు చిత్రయూనిట్ సోమవారం (జూలై 8) ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ ప్రెస్ మీట్‌లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ను చేశారు. తెలుగులోనే నాకు క్లాసిక్ హిట్స్ ఉన్నాయి. భారతీయుడు 2లో సేనాపతి చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా సమాజంలోంచి వచ్చినట్టే ఉంటాయి. రెండు వేళ్లు మడత పెట్టడం అంటే.. ఒకటి ఓటు వేసేది.. రెండోది మన బాధ్యతది చెప్పేది” అని అన్నారు.

“ఇండియన్ 2లో సాంగ్, ఫైట్స్ ఉన్నాయా? అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతుంటారు. అవన్నీ ఇందులో ఉంటాయి. కానీ, డిఫరెంట్‌గా ఉంటాయి. నేను గురువు అని సిద్దార్థ్ ప్రతీ సారి చెబుతుంటాడు. అవే మాటలు నేను శివాజీ గణేశన్ గారికి చెబుతుండేవాడిని. సిద్దార్థ్, నేను ఒక ఏకలవ్య శిష్యులం. ఇంకా కమల్ హాసన్ లాంటి వారు రావాలి.. సిద్దార్థ్ లాంటి వారు వస్తూ ఉండాలి. ఇండస్ట్రీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి” అని కమల్ హాసన్ తెలిపారు.

“భారతీయుడు 2 చిత్రాన్ని అందరూ వీక్షించండి. ఈ సినిమాలోని మెసెజ్ అందరికీ చేరాలి. అందుకోసం మీడియా మాకు సహకరించాలి. ఈ సినిమాను జనాల వరకు తీసుకెళ్లండి. జూలై 12న మా చిత్రాన్ని థియేటర్‌లలో చూడండి” అని ఉలగనాయగన్ కమల్ హాసన్ చెప్పారు.

“భారతీయుడు సమయంలో సీక్వెల్ తీస్తానని అనుకోలేదు. ఆ మూవీ తరువాత ఇన్నేళ్లలో ఎక్కడ లంచం తీసుకున్నారనే వార్తలు చదివినా నాకు సేనాపతి గుర్తుకు వచ్చేవాడు. కానీ, స్టోరీ సెట్ అవ్వలేదు. రోబో 2.ఓ తరువాత నాకు స్టోరీ కుదరడం, కమల్ హాసన్ గారికి చెప్పడంతో ఈ సినిమా మొదలైంది” అని డైరెక్టర్ శంకర్ తెలిపారు.

“నేను ఓ సీన్‌ను రాసిన దాని కంటే.. ఆయన నటించిన తరువాత ఆ సీన్ స్థాయి పదింతలు పెరుగుతుంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉంటుంది. ప్రతీ ఒక్క ఆడియెన్‌ను ఆకట్టుకునేలా ఉంటుంది. థియేటర్ నుంచి ఇంటికి వెళ్లే ప్రతీ ఆడియెన్ మైండ్‌లో ఓ ఆలోచన పుడుతుంది” అని ఇండియన్ 2 డైరెక్టర్ శంకర్ చెప్పుకొచ్చారు.

“ప్రతీ ఒక్క టెక్నీషియన్ కోసం ఈ సినిమాను చూడొచ్చు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్న సురేష్ బాబు గారికి థాంక్స్. జూలై 12న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి” అని భారతీయుడు 2 దర్శకుడు శంకర్ పేర్కొన్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024