TGSPDCL Bill Payment : కరెంట్ బిల్లు కట్టలేదా..? గూగుల్​ పే, ఫోన్​ పే లేకుండానే ఇలా క్లియర్ చేసేయండి..!

Best Web Hosting Provider In India 2024

TGSPDCL Bill Payment : మొన్నటి వరకు కరెంట్ బిల్లులను ఫోన్ పే, గూగుల్ పే లేదా పేటీఎం వంటి యాప్స్ ద్వారా క్షణాల వ్యవధిలోనే క్లియర్ చేసే అవకాశం ఉండేది. ఏమైనా పెండింగ్ ఉందా..? అనేది కూడా డిస్ ప్లే అయ్యేది. గడువు తేదీని కూడా తెలుసుకునే వీలు ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. జులై 1 నుంచి ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్‌ బిల్లులు చెల్లింపు ప్రక్రియలో మార్పులు వచ్చాయి.

ఇందులో భాగంగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి యాప్‌ల ద్వారా చెల్లించడం నిలిపివేసినట్లు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇటీవలే ప్రకటన చేశాయి. దీంతో చాలా మంది వినియోగదారులు చెల్లింపుల విషయంలో కాస్త గందరగోళానికి గరువుతున్నారు. మళ్లీ కరెంట్ ఆఫీసులకు వెళ్లి పేమెంట్ చేయాలా..? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే వినియోగదారులు గతంలో మాదిరిగానే సింపుల్ గా పేమెంట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ముందుగా మీరు TGSPDCL అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలోనే బిల్ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వివరాలను నమోదు చేసి సింపుల్ గా కరెంట్ బిల్లును క్లియర్ చేసుకోవచ్చు. కేవలం వెబ్ సైట్ మాత్రమే కాదు… యాప్ ను కూడా ఇన్ స్టాల్ చేసుకోని ఈ ప్రక్రియను కంప్లీట్ చేయవచ్చు.

మీ కరెంట్ బిల్లును ఇలా కట్టేయండి…..

  • విద్యుత్ వినియోగదారుడు బిల్లు చెల్లించేందుకు ముందుగా https://tgsouthernpower.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో Pay Bill online అనే ఆప్షన్​పై కనిపిస్తుంది. దీనిపై నొక్కాలి.
  • ఇక్కడ మీరు ఉపయోగించే USC (Unique Service Number) నెంబర్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్ పై నొక్కాలి.
  • బిల్  కు సంబంధించిన వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఆ తర్వాత  Click Here to Pay అనే ఆప్షన్​పై నొక్కాలి.
  • ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో బిల్లు చెల్లించేందుకు రకరకాల ఆప్షన్​లు కనిపిస్తాయి.  ఇందులో ఒక దానిని సెలక్ట్​ చేసుకోవాలి. ఇక్కడ  డిబెట్ కార్డు లేదా  T Wallet వంటి ఆప్షన్లు ఉంటాయి. మీకు అనువుగా ఉన్న దానిని ఎంపిక చేసి బిల్ క్లియర్ చేసుకోవచ్చు.

ఇక వెబ్ సైట్ ద్వారానే కాకుండా… TGSPDCL యాప్‌ నుంచి కూడా ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ముందుగా వినియోగదారుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి TGSPDCL యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ స్టాల్ అయ్యాక…. బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. ఇక వెబ్ సైట్, యాప్ ద్వారా కాకుండా… మీసేవా కేంద్రాలకు వెళ్లి కూడా పేమెంట్ చేయవచ్చు. ఇక మీకు దగ్గర్లోనే కరెంట్ ఆఫీస్ కేంద్రం ఉంటే అక్కడ కూడా పెండింగ్ బిల్లలను క్లియర్ చేయవచ్చు.

మరోవైపు టీఎన్పీడీసీఎల్‌(TGNPDCL) కరెంట్ బిల్లలు చెల్లింపులో సరికొత్తగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని తీసుకొచ్చింది.మీటర్ల నుంచి రీడింగ్‌ తీసిన తర్వాత బిల్లు వినియోగదారులకు ఇస్తారు. ఆ బిల్లు కిందే క్యూఆర్‌ కోడ్‌ కూడా ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్‌ ఫోన్‌ ద్వారా.. క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్‌ చేసి డెబిట్, క్రెడిట్‌ కార్డులు, యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కరెంట్ బిల్లును చెల్లించే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఫైలెట్ ప్రాజెక్ట్ విధానంలో అమలవుతోంది. దశలవారీగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

 

 

WhatsApp channel

టాపిక్

ElectricityTelangana NewsTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024