OTT Political Thriller: ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే..

Best Web Hosting Provider In India 2024


మే నెలలో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉన్న తరుణంలో కోలీవుడ్‍లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం వచ్చింది. ‘ఎలక్షన్’ పేరుతోనే ఆ చిత్రం రావటంతో మంచి బజ్ నెలకొంది. మే 17వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. స్థానిక పంచాయతీ ఎన్నికలు, వారి చుట్టూ జరిగే రాజకీయం ఆధారంగా ఈ ఎలక్షన్ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి సడెన్‍గా అడుగుపెట్టింది. తెలుగులోనూ కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

ఐదు భాషల్లో స్ట్రీమింగ్

ఎలక్షన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో తమిళంలోనే రిలీజైన ఈ చిత్రం ఓటీటీలో ఐదు భాషల్లో అడుగుపెట్టింది. ప్రైమ్ వీడియోలో ఎలక్షన్ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ముందుగా పెద్దగా ప్రచారం లేకుండా సడెన్‍గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఎలక్షన్ సినిమా  స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రావటంతో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఎలక్షన్ చిత్రంలో విజయ్ కుమార్ లీడ్ రోల్ చేయగా.. ప్రీతి అరసని, జార్జ్ మర్యన్, దిలీపన్, రిచా జోషి, పావెల్ నవగీతన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సేథుమన్ ఫేమ్ డైరెక్టర్ తమిళ్ దర్శకత్వం వహించారు. ఆదిత్య నారాయణన్ నిర్మించిన ఈ మూవీకి గోవింద్ వసంత సంగీతం అందించారు.

ఎలక్షన్ మూవీ స్టోరీ

తన తండ్రికి ఎదురైన అవమానానికి ప్రతీకారంగా నదరాసన్ (విజయ్ కుమార్) పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగడం, ఆ తర్వాత జరిగే ఎన్నికల వ్యూహాలు, హింస, మోసాల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఓ రాజకీయ పార్టీలో విధేయుడైన నాయకుడిగా ఉండే నల్లశివం (జార్జ్ మర్యన్) కుమారుడే నదరాసన్ (విజయ్ కుమార్). పార్టీకి ఎంతో విధేయుడిగా, నిజాయితీతో ఉండే నల్లశివంను చాలా మంది రాజకీయం కోసం వాడుకుంటూ ఉంటారు. అయినా పెద్దగా విలువ ఇవ్వరు. అయితే, ఈ క్రమంలో ఓ బడా లీడర్ పార్టీని వీడతారు. దీంతో నల్లశివంతో అతడికి విభేదాలు పెరుగుతాయి. ఈ క్రమంలో గొడవలు జరుగుతాయి. నల్లశివంకు అవమానం ఎదురవుతుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు నదరాసన్ రెడీ అవుతాడు. అలాగే, దివ్య (ప్రతీ అరసని)ను అతడు ప్రేమిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఎన్నికలు ఎలా జరిగాయి.. నదరాసన్ గెలిచాడా అనేవి ఎలక్షన్ మూవీ స్టోరీగా ఉంది.

కాగా, మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇటీవలే స్ట్రీమింగ్‍కు వచ్చింది. చాలా కాలం నుంచి ప్రేక్షకులు నిరీక్షిస్తున్న ఈ సీజన్ జూలై 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ ప్రస్తుతం ప్రైమ్ వీడియో ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించిన మీర్జాపూర్ మూడో సీజన్‍కు కరణ్ ఆయుష్మాన్, పునీత్ కృష్ణ క్రియేటర్లుగా ఉన్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024