Keema Sandwich: పిల్లల కోసం కీమా సాండ్‌విచ్, ఇది ఒక హెల్తీ సాండ్‌విచ్ రెసిపీ

Best Web Hosting Provider In India 2024

Keema Sandwich: సాండ్‌విచ్ కోసం ఎప్పుడు బ్రౌన్ బ్రెడ్ ను వినియోగించండి. వైట్ బ్రెడ్‌ను మైదాతో తయారుచేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. బ్రౌన్ బ్రెడ్‌తో కీమా సాండ్‌విచ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఒక్కసారి దీన్ని చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. అంతేకాదు దీన్ని చేయడం చాలా సులువు.

కీమా సాండ్‌విచ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మటన్ కీమా – 100 గ్రాములు

ఉల్లిపాయ – ఒకటి

నూనె – రెండు స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

కారం – ఒక స్పూను

కొత్తిమీర తరుగు – ఒక స్పూను

గరం మసాలా – పావు స్పూను

ఉప్పు – రుచికి సరిపడా

నీళ్లు – తగినంత

బ్రౌన్ బ్రెడ్ – నాలుగు స్లైసులు

టమోటో – ఒకటి

క్యాప్సికం – ఒకటి

కీమా సాండ్‌విచ్ రెసిపీ

1. కీమాను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి.

2. ఒకటిన్నర స్పూన్ నూనె, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, నీరు, కారం, కొత్తిమీర తరుగు, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

3. ఆ కీమా పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి.

4. దాదాపు అయిదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

5. తర్వాత ఆవిరి పోయాక మళ్ళీ స్టవ్ మీద కీమాలోని నీరంతా ఇంకిపోయి గట్టిగా ఇగురులా అయ్యే వరకు వేయించాలి.

6. ఇప్పుడు ఆ కీమాను తీసి పక్కన పెట్టుకోవాలి.

7. సాండ్విచ్ చేసేందుకు బ్రౌన్ బ్రెడ్ ను రెండు వైపులా కాల్చుకోవాలి.

8. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు చల్లుకోవాలి.

9. దానిపై ఉడికించిన కీమాను పెట్టాలి.

10. అలాగే టమాటా తరుగు, క్యాప్సికం తరుగును కూడా చల్లుకోవాలి.

11. దానిపై మరొక బ్రెడ్ స్లైస్ ను పెట్టాలి. అంతే టేస్టీ కీమా సాండ్‌విచ్ రెడీ అయినట్టే.

12. రెండు సాండ్‌విచ్‌లు తింటే చాలు. పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది

పిల్లలు సాండ్‌విచ్ అడుగుతున్నప్పుడు ఇలా కీమా సాండ్‌విచ్ పెట్టి చూడండి. వారికి మటన్ లోని పోషకాలు కూడా అందుతాయి. అలాగే బ్రౌన్ బ్రెడ్, ఉల్లిపాయ, టమోటోలో ఉన్న పోషకాలు కూడా శరీరంలో చేరుతాయి. దీన్ని చేయడం చాలా సులువు. కీమాను తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా కీమా సాండ్‌విచ్ చేసి పెడితే కీమా తినడం అలవాటవుతుంది. బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది, కాబట్టి ఇది పూర్తిగా హెల్దీ రెసిపీ అని చెప్పుకోవాలి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024