
Best Web Hosting Provider In India 2024

TG Group 2, 3 Exams : తెలంగాణలో పోటీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా వేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో గ్రూప్-2, 3 పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, పరీక్షలు వాయిదా వేయలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేశారనే ప్రచారాన్ని నిరుద్యోగులు నమ్మొద్దని కోరింది. పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు సరైన సమయం లేదని పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడంలేదు. పరీక్షల వాయిదా కుదరదని స్పష్టం చేస్తుంది. వాయిదా వేస్తే ప్రభుత్వానికే లాభమని, అయినా నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించేందుకే సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
డీఎస్సీ వాయిదాపై క్లారిటీ
డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని గత కొన్ని రోజులు తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అయితే డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయలేమని, షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే డీఎస్సీ వాయిదా వేసే వరకు ఆందోళన విరమించమని నిరుద్యోగులు పట్టుబడుతున్నారు. అయితే ఈ ఆందోళన వెనక కోచింగ్ సెంటర్ల కుట్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వ్యాపార ఉద్దేశంతో కోచింగ్ సెంటర్లు, రాజకీయ ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు పోటీ పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
సంబంధిత కథనం
టాపిక్