Today OTT Movies: ఓటీటీలో ఇవాళే మూవీ ఫెస్టివల్- ఏకంగా 11 రిలీజ్- తెలుగులో 4 స్ట్రీమింగ్- ఈ 5 మాత్రం మిస్ కావొద్దు!

Best Web Hosting Provider In India 2024

Today OTT Movies: ప్రతివారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తూనే ఉంటాయని తెలిసిందే. అలాగే ప్రతి శుక్రవారమే ఎక్కువగా సినిమాలు ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. కానీ, ఈసారి మాత్రం దానికి భిన్నంగా ఆశ్చర్యం కలిగించేలా ఫ్రైడేకి బదులు గురువారం ఎక్కువగా ఓటీటీ రిలీజ్‌కు వచ్చాయి.

సినీ జాతర

ఈ వారం మొత్తంగా 23 వరకు సినిమాలు ఓటీటీలో విడుదల అవుతుంటే కేవలం గురువారం ఒక్కరోజే ఏకంగా 11 డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ఈసారి ఫ్రైడే మూవీ ఫెస్టివల్‌కు బదులు గురువారం సినీ జాతరగా మారింది. మరి ఈ సినిమాల్లో ఏవి చూడాల్సినవి, స్పెషలేంటీ అనే విషయాలు చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1

బోర్డర్ లెస్ ఫాగ్ (ఇండోనేషిన్ సినిమా)- ఆగస్ట్ 1

లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో (స్పానిష్ వెబ్ సిరీస్)-ఆగస్ట్ 1

మ్యాన్ లఫెర్ట్ టెమో (స్పానిష్ చిత్రం)- ఆగస్ట్ 1

అన్‌స్టెబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 1

జియో సినిమా ఓటీటీ

డ్యూన్ పార్ట్ 2 (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 1

గుహ్డ్ చడీ (హిందీ చిత్రం)- ఆగస్ట్ 1

ఈటీవీ విన్ ఓటీటీ

సత్యభామ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 1

డియర్ నాన్న (తెలుగు మూవీ)- ఆగస్ట్ 1

రక్షణ (తెలుగు చిత్రం)- ఆహా ఓటీటీ- ఆగస్ట్ 1

బ్యాట్ మ్యాన్: క్యాప్‌డ్ క్రూసేడర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- ఆగస్ట్ 1

భారీ బ్లాక్ బస్టర్ హిట్

ఇలా గురువారం అంటే ఆగస్ట్ 1న ఓటీటీలోకి సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 11 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సీక్వెల్ మూవీ డ్యూన్ 2 చాలా స్పెషల్ కానుంది. అది కూడా ఇంగ్లీషుతోపాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లో డ్యూన్ పార్ట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదివరకే చూసిన

ఇదే కాకుండా కాజల్ అగర్వాల్ నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సత్యభామ, తండ్రీకొడుకుల బంధాన్ని చాటిచెప్పే డియర్ నాన్న మరో ఓటీటీ ఈటీవీ విన్‌లోకి ఇవాళ వచ్చేశాయి. ఇంతకుముందు సత్యభామ అమెజాన్ ప్రైమ్‌లో, డియర్ నాన్న ఆహాలో స్ట్రీమింగ్ అయ్యాయి. ఇదివరకు చాలా వరకు ప్రేక్షకులు ఈ సినిమాలను చూసినప్పటికీ ఇవాళ్టీ ఓటీటీ మూవీస్‌లో ప్రత్యేకం కానున్నాయి.

ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్

ఇక బోల్డ్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ నటించిన క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ రక్షణ సినిమా కూడా ఇవాళే ఓటీటీలోకి వచ్చేసింది. దీంతోపాటు బ్యాట్ మ్యాన్ వెబ్ సిరీస్ కూడా ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. ఇలా నాలుగు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో మొత్తంగా ఐదు చాలా ప్రత్యేకం కానున్నాయి.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024