Best Web Hosting Provider In India 2024
2024 డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మెజారిటీ ఓట్లతో విజయం సాధించారు. ఫలితంగా ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె నిలవనున్నారు
బైడెన్ ఔట్.. కమలా హరిస్ ఇన్..
రెండు వారాల క్రితం మాజీ డెమొక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జై బైడెన్ ఎన్నికల నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఇప్పుడు డెమొక్రటిక్ పార్టీ అధికారులు కమలా హారిస్‌ని పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు.
“అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగడం గౌరవంగా భావిస్తున్నా. వచ్చే వారం నామినేషన్‌ను అధికారికంగా స్వీకరిస్తాను. ఈ ప్రచారం దేశంపై ప్రేమతో ఆజ్యం పోసి, మనమెవరో మంచి కోసం పోరాడటానికి ప్రజలంతా ఏకతాటిపైకి రావడం గురించి ఉంటుంది,” అని హారిస్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో రాశారు.
ఈ ప్రకటన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్ష పదవికి కమలా హారిస్‌ని ఎన్నుకోవడానికి తాను తీసుకున్న ఉత్తమమైన నిర్ణయాలలో ఒకటి అని అన్నారు. “నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయాలలో ఒకటి @KamalaHarris నా ఉపాధ్యక్షురాలిగా ఎంచుకోవడం. ఇప్పుడు ఆమె మా పార్టీ అభ్యర్థిగా ఉన్నందున నేను గర్వపడుతున్నాను,’ అని ఆయన అన్నారు.
4,000 మందికి పైగా కన్వెన్షన్ డెలిగేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గత సోమవారం వరకు సమయం ఉంది. కానీ హారిస్ పోటీ చేయడానికి ఇతర అభ్యర్థులు ఎవరూ అర్హత సాధించకపోవడంతో, ఆమె నామినేషన్ ఖరారైపోయింది.
ఒక ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి నాయకత్వం వహించిన ఫస్ట్ ఉమెన్ ఆఫ్ కలర్‌గా కమలా హారిస్‌ని అధికారికంగా నామినేట్ చేయడం జాతి, లింగ సమస్యలతో చారిత్రాత్మకంగా విభజించనకు గురైన దేశానికి ఒక ముఖ్యమైన మైలురాయి అని ది పోస్ట్ పేర్కొంది.
సోమవారం ఆన్లైన్ ఓటింగ్ ప్రారంభమైన మరుసటి రోజే కమలా హారిస్ అవసరమైన పరిమితికి చేరుకున్నారని డెమొక్రటిక్ నేషనల్ కమిటీ చైర్మన్ జైమ్ హారిసన్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు కమలా హ్యారిస్ అధికారికంగా పత్రాలపై జులై 27న సంతకం చేశారు. నవంబర్‌లో తన ప్రజాశక్తితో కూడిన ప్రచారాన్ని గెలిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
జులై 30న 3,900 మందికి పైగా ప్రతినిధులు కమలా హారిస్‌ని నామినేషన్ కోసం బ్యాలెట్లో ఉంచాలని పిటిషన్ దాఖలు చేశారని డెమొక్రటిక్ నేషనల్ కమిటీ తెలిపింది.
జాతిపరంగా చూసుకుంటే, 2008లో బరాక్ ఒబామా తర్వాత దాదాపు 250 ఏళ్ల అమెరికా చరిత్రలో అధ్యక్ష రేసు నడిపించిన ఉన్న రెండో వ్యక్తి కమలా హారిస్ కావడం విశేషం. నల్లజాతీయురాలు, భారతీయ అమెరికన్ మహిళగా కమలా హారిస్ ఇటీవల ట్రంప్ నుంచి విమర్శలను ఎదుర్కొన్నారు. ఆమె ఒకప్పుడు తన నల్లజాతి వారసత్వాన్ని తక్కువ చేసి చూపారని ఆరోపించారు.
2016లో హిల్లరీ క్లింటన్ తర్వాత అధ్యక్ష పదవికి ప్రధాన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రెండో మహిళ కమలా హారిస్. ఆ ఏడాది ట్రంప్ చేతిలో హిల్లరీ క్లింటన్ అనూహ్యంగా ఓడిపోవడం డెమొక్రాట్లను షాక్‌కు గురిచేసి రాజకీయ ముఖచిత్రాన్ని నాటకీయంగా మార్చేసింది.
సంబంధిత కథనం