Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా రష్మిక మందన్నా బెస్ట్ ఫ్రెండ్.. అర్థరాత్రి 2 గంటలకు అంటూ!

Best Web Hosting Provider In India 2024


Bigg Boss Telugu 8 Final Contestants On Launch: ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ స్టార్ట్ అయిపోయింది. దేవర సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత హౌజ్‌లోకి వెళ్లి బిగ్ బాస్ హౌజ్ మొత్తం చూపించారు నాగార్జున. స్విమ్మింగ్ పూల్ నుంచి లోపల ఉన్న కిచెన్ వరకు ఒక్కో దాని గురించి, అక్కడ కంటెస్టెంట్ చేసే అల్లరి, గొడవలు గురించి చెప్పారు నాగ్.

మొదటి జోడీగా

ఆ తర్వాత ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ముందుగా ఫస్ట్ కంటెస్టెంట్‌గా యశ్మీ గౌడ ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో విలన్‌గా ముకుంద పాత్రలో అలరించిన యశ్మీ గౌడ మంచి డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో అడుగుపెట్టింది. తనకు బడ్డీగా నిఖిల్ మలియక్కల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరు కలిసి హౌజ్‌లోకి అడుగుపెట్టారు.

అభయ్ బడ్డీగా ప్రేరణ

ఇక మూడో కంటెస్టెంట్‌గా పెళ్లి చూపులు ఫేమ్ అభయ్ నవీన్ వచ్చాడు. తన జీవితంలోని మంచి చెడులు చెబుతూ ఏవీ ప్లే చేశారు. ఆ తర్వాత అభయ్ తన బడ్డీని సెలెక్ట్ చేసుకునేందుకు ఓ కలర్ ఎంచుకోవాలి. అభయ్ యెల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటే.. అందులో వాగుడు కాయి, ఫైటర్, తెలివి అనే మూడు క్వాలిటీస్ వచ్చాయి. దాంతో నాలుగో కంటెస్టెంట్‌గా అభయ్ నవీన్ బడ్డీగా ప్రేరణ కంబం అడుగుపెట్టింది.

రూమ్ మేట్ కాదు

కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్‌గా కృష్ణ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్న బ్యూటి ప్రేరణ. నాగార్జునను చూసి అలాగే అవాక్కయింది ప్రేరణ. “మిమ్మల్ని చూస్తాను, హగ్ ఇస్తాను అని ఎంతో అనుకున్నాను. కానీ, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నా” అని ప్రేరణ చెప్పింది. ఆ తర్వాత “నీకో రూమ్‌ మేట్ ఉందట కదా” అని నాగార్జున అడిగితే.. “రూమ్ మేట్ కాదు ఫ్రెండ్” అని సంతోషంగా చెప్పింది ప్రేరణ.

చడ్డీ బడ్డీ దోస్త్‌లా

“నా ఫ్రెండ్ పేరు రష్మిక. మేమిద్దరం కలిసి చాలా ఫన్ చేసేవాళ్లం. తిరిగేవాళ్లం” అని ప్రేరణ చెబుతుంటే.. “రష్మిక మందన్నానా” అని నాగార్జున అంటాడు. “అవును, రష్మిక మందన్నానే. తాను ఇంతపెద్ద హీరోయిన్ అవడం చాలా సంతోషంగా ఉంది. తాను పెద్ద హీరోయిన్ అయినా నాతో చడ్డీ బడ్డీ దోస్త్‌లా ఉంటుంది” అని ప్రేరణ చెప్పుకొచ్చింది.

లగేజ్ కిందపడిపోయింది

“ఓసారి మోడలింగ్‌కి స్కూటీ పెప్‌లో అర్థరాత్రి రెండు గంటలకు లగేజ్ పట్టుకుని వెళ్లాం. అప్పుడు మోడలింగ్ టైమ్. అలా వెళ్లేటప్పుడు లగేజ్ కిందపడిపోయింది. అందులో ఉన్న హిల్స్, బట్టలు అటు ఇటు వేస్తున్నాం. ఏం పట్టించుకోకుండా చాలా సరదాగా ఉంటాం” అని ప్రేరణ తెలిపింది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024