AP TET 2024 Results: ఏపీ టెట్ 2024 ఫలితాలను విడుదల చేసిన మంత్రి నాారా లోకేష్‌, 50.79శాతం ఉత్తీర్ణత

Best Web Hosting Provider In India 2024

AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్‌ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల కోసం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. 2024 టెట్ పరీక్షల్లో మొత్తం 1,87,256మంది ఉత్తీర్ణులయ్యారు.

పేపర్‌ 1ఏ తెలుగు, మైనర్‌ మీడియా సబ్జెక్టుకు 160017మంది హాజరైతే 104785మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం హాజరైన వారిలో 65.48శాతం ఉత్తీర్ణులయ్యారు.

పేపర్ 1బిలో ఎస్జీటీ స్పెషల్ స్కూల్స్‌ పేపర్‌లో 2173మంది హాజరైతే వారిలో 767మంది అర్హత సాధించారు. 35.3శాతం ఉత్తీర్ణులయ్యారు.

పేపర్ 2ఏలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌ పరీక్షకు 55781మంది హాజరైతే 22,080మంది ఉత్తీర్ణులయ్యారు. 39.58శాతం మంది అర్హత సాధించారు.

పేపర్ 2ఏ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌, సైన్స్‌ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో 88290మంది హాజరైతే 33525మంది అర్హత సాధించారు. 37.97శాతం మంది క్వాలిఫై అయ్యారు.

పేపర్ 2ఏ స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు 60442మంది హాజరైతే 24472మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం హాజరైన వారిలో 40.49శాతం అర్హత పొందారు.

పేపర్ 2బి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్స్‌కు 1958మంది హాజరైతే 1627మంది అర్హత సాధించారు. మొత్తం 83.09మంది క్వాలిఫై అయ్యారు.

ఏపీ టెట్‌ 2024 పరీక్షలకు మొత్తం 3,68,661మంది హాజరయ్యారు. వారిలో 1,87,256మంది క్వాలిఫై అయ్యారు. 50.79శాతం మందికి అర్హత పొందారు.

ఫలితాలకు https://aptet.apcfss.in/ నుంచి పొందొచ్చు.

Whats_app_banner

టాపిక్

Exam ResultsAp TetAp Dsc 2024Exams
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024