Thandel: తండేల్ కోసం పుష్పరాజ్ – నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి మూవీ ప్ర‌మోష‌న్స్‌కు గెస్ట్‌లుగా రానున్న‌ స్టార్లు వీళ్లే!

Best Web Hosting Provider In India 2024

Thandel: తండేల్ కోసం పుష్పరాజ్ – నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి మూవీ ప్ర‌మోష‌న్స్‌కు గెస్ట్‌లుగా రానున్న‌ స్టార్లు వీళ్లే!

Nelki Naresh Kumar HT Telugu
Jan 30, 2025 06:10 AM IST

Thandel: తండేల్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీ హిందీ, త‌మిళ ప్ర‌మోష‌న్స్‌కు ఆయా భాష‌ల స్టార్ హీరోలు గెస్ట్‌లుగా రానున్నారు. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ కాబోతోంది.

తండేల్ మూవీ
తండేల్ మూవీ

Thandel: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న తండేల్ మూవీ ఫిబ్ర‌వ‌రి 7న రిలీజ్ కాబోతోంది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని జీఏ2 ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. తండేల్ రిలీజ్‌కు మ‌రో ఏడు రోజులు మాత్ర‌మే టైమ్ ఉండ‌టంతో సినిమా యూనిట్ భారీగా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తోంది.ఈవెంట్స్‌లో ప‌లువురు స్టార్ హీరోలు గెస్టులుగా సంద‌డి చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

yearly horoscope entry point

మూడు భాష‌ల్లో…

తండేల్ తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. మూడు భాష‌ల‌కు త‌గ్గ‌ట్లుగా ప్ర‌మోష‌న్స్ భారీగా నిర్వ‌హించ‌బోతున్నారు. తండేల్ త‌మిళ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ గురువారం (నేడు) చెన్నైలో జ‌రుగ‌నుంది. ఈ త‌మిళ ట్రైల‌ర్‌ను కోలీవుడ్ అగ్ర హీరో కార్తి రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే తండేల్ మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

ఆమిర్‌ఖాన్‌….

శుక్ర‌వారం తండేల్ హిందీ వెర్ష‌న్‌కు సంబంధించి ఓ గ్రాండ్ ఈవెంట్ ముంబైలో జ‌రుగ‌నుంది. ఈ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ గెస్ట్‌గా హాజ‌రుకున్నాడు. ఈ ఈవెంట్‌లోనే తండేల్ హిందీ ట్రైల‌ర్‌ను ఆమిర్‌ఖాన్ లాంఛ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం స‌మాచారం.

తెలుగులో పుష్ప‌రాజ్‌…

తండేల్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్ రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రి 2న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత అల్లు అర్జున్ అటెండ్ కానున్న ఫ‌స్ట్ మూవీ ఈవెంట్ ఇదే కానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఒక‌టి రెండు రోజుల్లో రానుంది. హైద‌రాబాద్‌లోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగ‌నున్న‌ట్లు తెలిసింది. గీతా ఆర్ట్స్ నిర్మాణంలోనే రూపొందిన సినిమా కావ‌డంతోనే అల్లు అర్జున్ ఈ వేడుక‌కు గెస్ట్‌గా హాజ‌రుకానున్నారు.

ప్రేమ‌…దేశ‌భ‌క్తి…

ప్రేమ క‌థ‌కు దేశ‌భ‌క్తిని మిక్స్ చేస్తూ ద‌ర్శ‌కుడు చందు మొండేటి తండేల్ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు. తండేల్ అంటే లీడ‌ర్ అని ట్రైల‌ర్ ద్వారా టైటిల్‌కు అర్థం ఏమిటో వివ‌రించారు. స‌ముద్రంలో చేపల వేట‌కు వెళ్లిన రాజు అనే జాల‌రి పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లోకి వెళ్లి ఆ దేశ సైన్యానికి చిక్కుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? రాజు కోసం అత‌డి ప్రియురాలు ఏం చేసింది అనే అంశాల‌తో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తుంటే తెలుస్తోంది.

తండేల్ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. ల‌వ్‌స్టోరీ త‌ర్వాత నాగ‌చైతన్య‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తోన్న సెకండ్ మూవీ ఇది.రిలీజ్‌కు ముందే తండేల్ ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోయాయి. నెట్‌ఫ్లిక్స్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న‌ది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024