Fitness After 30: ముప్పై ఏళ్లు దాటాయంటే మీ జీవితంలో ఈ మార్పులు చేయాలి.. లేదంటే తర్వగా ముసలి వాళ్లు అయిపోతారు!

Best Web Hosting Provider In India 2024

Fitness After 30: ముప్పై ఏళ్లు దాటాయంటే మీ జీవితంలో ఈ మార్పులు చేయాలి.. లేదంటే తర్వగా ముసలి వాళ్లు అయిపోతారు!

Ramya Sri Marka HT Telugu
Jan 31, 2025 08:30 AM IST

Fitness After 30: ముప్పై దాటితే అందరూ ముసలి వాళ్లు అయిపోయివాల్సిందేనా? శరీరం, చర్మం శక్తిని కోల్పోయి నీరసంగా, వయసు పెరిగినట్టుగా తయారవుతుందా? అంటే కచ్చితంగా కాదనే అంటున్నారు నిపుణులు. 30 ఏళ్లు దాటిన తర్వాత మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటిస్తే, మీ శరీరం ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది.

ముప్పై ఏళ్లు దాటాయంటే మీ జీవితంలో ఈ మార్పులు చేయా
ముప్పై ఏళ్లు దాటాయంటే మీ జీవితంలో ఈ మార్పులు చేయా (Shutterstock)

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుంది. వృద్ధాప్య ఛాయలు వెంటాడుతాయి. అయితే ఒకప్పుడు 60ఏళ్లకే వచ్చే ఈ సమస్యలు ఇప్పుడు 30 ఏళ్లకే వస్తున్నాయి. ఇందుకు మారుతున్న జీవిన విధానం, కలుషితమైన గాలి, రసాయనాలతో తయారవుతున్న ఆహారాలు అయి ఉండచ్చు. అంటే నేటి రోజుల్లో 30 దాటాయంటే ప్రతి ఒక్కరూ ముసలి వాళ్లు అయిపోవాల్సిందేనా? శరీరం, చర్మం తమన శక్తిని కోల్పోయి బలహీనంగా, వయసు పెరిగినట్టుగా తయారవుతుందా? అంటే కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా జరిగే ప్రమాదం ఉన్నప్పడటికీ దాని నుంచి తప్పించుకోవడం మీ చేతిలోనే ఉందంటున్నారు. ఎలాగో తెలుసుకుందాం.

yearly horoscope entry point

వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత, ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం అవసరం. ఈ సమయంలో తమ డైట్‌లో ఏమి చేర్చాలి, ఏమి చేర్చకూడదు అనే దానితో పాటు, ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రోజు మనం అలాంటి కొన్ని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుకుందాం, వీటిని మీరు 30 ఏళ్లు దాటిన తర్వాత కచ్చితంగా పాటిస్తే వయసు పెరిగిన తర్వాత కూడా ఎక్కువ కాలం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండగలుగుతారు. యవ్వనంగా కనిపించేందుకు ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు మీకు చాలా సహాయపడతాయి.

బ్రేక్ ఫాస్ట్ మానేయకండి

ఉదయం అల్పాహారం మన రోజులో అతి ముఖ్యమైన భోజనం. కాబట్టి, ఎంత వయసు ఉన్నా, ఉదయం అల్పాహారం మానేయడం మంచి అలవాటు కాదు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదని గుర్తుంచుకోండి. బ్రేక్ ఫాస్ట్ బాగా తినండి, అలాగే అందులోకి ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోండి. ఇది మీకు ఉదయాన్నే మంచి శక్తినిస్తుంది, రోజంతా మీ శరీరం చురుగ్గా, అందంగా ఉండేలా చేస్తుంది.

సరైన సమయంలో భోజనం చేయండి

ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలంటే మీరు ఏమి తింటున్నారనేది ముఖ్యమే, కానీ దాని కన్నా మీరు ఎప్పుడు తింటున్నారో కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ, మీరు సరైన సమయంలో భోజనం చేసే అలవాటును పెంచుకోవాలి. మీ అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించుకోవాలి. ప్రతిరోజూ దాదాపు అదే సమయంలో భోజనం చేయాలి. సాయంత్రం 7 గంటలకు లేదా గరిష్టంగా 8 గంటల లోపు రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది, అలాగే శరీరానికి పోషకాలు బాగా అందుతాయి.

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి

యవ్వనంగా, చురుగ్గా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు, తగినంత నీరు త్రాగడం కూడా శరీరానికి చాలా ముఖ్యం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ శరీరానికి నీటి అవసరం పెరుగుతుంది. కాబట్టి మీరు రోజుకు తగినంత నీరు త్రాగకపోతే రోజంతా అలసట, బలహీనతను అనుభవించాల్సి వస్తుంది. అంతేకాకుండా అనేక వ్యాధులు కూడా సులభంగా దరిచేరతాయి. కాబట్టి, ప్రతిరోజూ తగినంత నీరు త్రాగండి, లేదంటే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగయాలను తీసుకుంటూ మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

మీ ఆహారం ఇలా ఉండాలి

వయసు పెరిగే కొద్దీ శరీర అవసరాలు మారుతాయి మరియు ఈ అవసరాలను తీర్చడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 30 ఏళ్లు దాటిన తర్వాత మీరు మీ ఆహారంలో ఫైబర్ ను పెంచుకోవాలి. అదనంగా, మీ ఆహారంలో ఒమేగా 3 మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ సమయంలో, వేయించిన, ప్యాక్ చేసిన ఆహారాలను తగ్గించి, వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ను మీ ఆహారంలో చేర్చుకోవాలి.

కఠినమైన వ్యాయామం కాదు, స్మార్ట్ వ్యాయామం చేయండి

శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచడానికి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత మీరు వ్యాయామాన్ని మీ దినచర్యలో తప్పకుండా భాగం చేసుకోవాలి. అయితే, ఈ సమయంలో మిమ్మల్ని మీరు ఎక్కువగా శ్రమ పెట్టుకోకండి. మీకు నచ్చిన వ్యాయామాలను మీ దినచర్యలో చేర్చుకోండి. కొత్త రకాల శారీరక శ్రమలను ప్రయత్నించండి, మీ ఫిట్‌నెస్ నిపుణుడితో కలిసి వ్యాయామ ప్రణాళికను రూపొందించుకోండి. మీ శరీర అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌గా వ్యాయామం చేస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024